యబ్బేజు తన సోదరులకంటే ఘనత పొందాడు. అతని తల్లి, “వేదనతో ఇతన్ని కన్నాను” అని చెప్పి అతనికి యబ్బేజు అని పేరు పెట్టింది. యబ్బేజు ఇశ్రాయేలు దేవునికి మొరపెట్టి, “మీరు నన్ను ఖచ్చితంగా దీవించి నా సరిహద్దులను విశాలపరచండి! మీ చేయి నాకు తోడుగా ఉంచి, నాకు బాధ కలుగకుండా కీడు నుండి నన్ను తప్పించండి” అని ప్రార్థించాడు. దేవుడు అతని మనవి అంగీకరించి దాని ప్రకారం జరిగించారు.
కెలూబు షూవహుకు సోదరుడు మెహీరుకు తండ్రి, మెహీరు ఎష్తోనుకు తండ్రి. ఎష్తోను బేత్-రాఫాకు పాసెయకు ఈర్-నహాషు తండ్రియైన తెహిన్నాకు తండ్రి. వీరు రేకా వారసులు.
కెనజు కుమారులు:
ఒత్నీయేలు, శెరాయా.
ఒత్నీయేలు కుమారులు:
హతతు, మెయానొతై. మెయానొతై ఒఫ్రాకు తండ్రి.
శెరాయా యోవాబుకు తండ్రి,
యోవాబు గె-హరషీముకు తండ్రి, ఆ ప్రాంతంలో నిపుణులైన పనివారు ఉండేవారు కాబట్టి అలా పిలువబడింది.
యెఫున్నె కుమారుడైన కాలేబు కుమారులు:
ఈరూ, ఏలా, నయము,
ఏలా కుమారుడు:
కనజు.
యెహల్లెలేలు కుమారులు:
జీఫు జీఫా, తీర్యా, అశర్యేలు.
ఎజ్రా కుమారులు:
యెతెరు, మెరెదు, ఏఫెరు, యాలోను.
మెరెదు భార్యల్లో ఒకరికి పుట్టిన వారు మిర్యాము, షమ్మయి, ఎష్టెమో తండ్రియైన ఇష్బాహు. మెరెదు పెళ్ళి చేసుకున్న ఫరో కుమార్తెయైన బిత్యా ద్వారా పుట్టిన కుమారులు వీరే.
యూదు గోత్రీకురాలైన అతని భార్యకు గెదోరు తండ్రియైన యెరెదు, శోకోకు తండ్రియైన హెబెరు, జానోహ తండ్రియైన యెకూతీయేలు పుట్టారు.
నహము సోదరియైన హూదీయా భార్యకు పుట్టిన కుమారులు:
గర్మీయుడైన కెయీలా తండ్రి, మయకాతీయుడైన ఎష్టెమో.
షీమోను కుమారులు:
అమ్నోను, రిన్నా, బెన్-హనాను, తీలోను.
ఇషీ సంతానం:
జోహేతు, బెన్-జోహేతు.
యూదా కుమారుడైన షేలా కుమారులు:
లేకా తండ్రియైన ఏరు, మరేషా తండ్రియైన లద్దా, సన్నని నారబట్టలు నేసే బేత్-అష్బేయ వంశీకులు,
యోకీము, కోజేబా వారు, యోవాషు, శారాపు, మోయాబులో, యాషూబిలెహెములో పరిపాలన చేశారు. (ఇవి పూర్వకాలంలో వ్రాసి పెట్టిన సంగతులు.)