1 దినవృత్తాంతములు 11:20-47

1 దినవృత్తాంతములు 11:20-47 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

యోవాబు సోదరుడైన అబీషై ఆ ముగ్గురికి నాయకుడు. ఒక యుద్ధంలో అతడు తన ఈటెను ఆడిస్తూ మూడువందల మందిని చంపాడు కాబట్టి అతడు ఆ ముగ్గురిలా ప్రసిద్ధి పొందాడు. అతడు ఆ ముగ్గురికంటే రెండింతలు గౌరవించబడి వారి దళాధిపతి అయ్యాడు కాని వారిలో ఒకనిగా చేర్చబడలేదు. గొప్ప పోరాట వీరుడు, కబ్సెయేలుకు చెందిన యెహోయాదా కుమారుడైన బెనాయా గొప్ప సాహస కార్యాలను చేశాడు. అతడు మోయాబు యొక్క పరాక్రమశాలులైన ఇద్దరిని చంపాడు. అంతేకాక, మంచుపడే కాలంలో ఒక గుంటలోకి దిగి సింహాన్ని చంపాడు. అతడు అయిదు మూరల ఎత్తున్న ఈజిప్టు వానిని చంపాడు. ఆ ఈజిప్టు వాని చేతిలో నేతపనివాని కర్రలాంటి ఈటె ఉన్నప్పటికీ, బెనాయా దుడ్డుకర్ర పట్టుకుని వాని మీదికి పోయాడు. ఆ ఈజిప్టు వాని చేతిలో ఉన్న ఈటెను లాక్కుని దానితోనే అతన్ని చంపాడు. యెహోయాదా కుమారుడైన బెనాయా సాహస కార్యాలు ఇలాంటివి; అతడు కూడా ఆ ముగ్గురు గొప్ప యోధులతో పాటు ప్రసిద్ధి పొందాడు. ఆ ముప్పైమందిలో ఘనతకెక్కాడు గాని, ఆ ముగ్గురి జాబితాలో చేర్చబడలేదు. దావీదు అతన్ని తన అంగరక్షకుల నాయకునిగా నియమించాడు. పరాక్రమముగల బలాఢ్యులు వీరే: యోవాబు తమ్ముడైన అశాహేలు, బేత్లెహేముకు చెందిన దోదో కుమారుడైన ఎల్హానాను, హరోరీయుడైన షమ్మోతు, పెలోనీయుడైన హేలెస్సు, తెకోవాకు చెందిన ఇక్కేషు కుమారుడైన ఈరా, అనాతోతుకు చెందిన అబీయెజెరు, హుషాతీయుడైన సిబ్బెకై, అహోహీయుడైన ఈలై, నెటోపాతీయుడైన మహరై, నెటోపాతీయుడైన బయనా కుమారుడు హేలెదు, బెన్యామీనీయుల గిబియాకు చెందిన రీబై కుమారుడు ఇత్తయి, పిరాతోనీయుడైన బెనాయా, గాయషు కనుమలకు చెందిన హూరై, అర్బాతీయుడైన అబీయేలు, బహరూమీయుడైన అజ్మావెతు, షయల్బోనీయుడైన ఎల్యహ్బా, గిజోనీయుడైన హాషేము కుమారులు, హరారీయుడైన షాగే కుమారుడైన యోనాతాను, హరారీయుడైన శాకారు కుమారుడైన అహీయాము, ఊరు కుమారుడైన ఎలీపాలు, మెకేరాతీయుడైన హెఫెరు, పెలోనీయుడైన అహీయా, కర్మెలీయుడైన హెజ్రో, ఎజ్బయి కుమారుడైన నయరై, నాతాను సోదరుడైన యోవేలు, హగ్రీ కుమారుడైన మిబ్హారు, అమ్మోనీయుడైన జెలెకు, బెయేరోతీయుడైన నహరై, ఇతడు సెరూయా కుమారుడైన యోవాబు ఆయుధాలను మోసేవాడు, ఇత్రీయుడైన ఈరా, ఇత్రీయుడైన గారేబు, హిత్తీయుడైన ఊరియా, అహ్లయి కుమారుడైన జాబాదు, రూబేనీయుడైన షీజా కుమారుడు రూబేనీయులకు పెద్దయైన అదీనా, అతనితో ఉన్న ముప్పైమంది, మయకా కుమారుడైన హానాను, మిత్నీయుడైన యెహోషాపాతు, ఆష్తెరాతీయుడైన ఉజ్జీయా, అరోయేరీయుడైన హోతాము కుమారులైన షామా, యెహీయేలు, షిమ్రీ కుమారుడైన యెదీయవేలు, అతని సోదరుడు తిజీయుడైన యోహా, మహవీయుడైన ఎలీయేలు, ఎల్నయము కుమారులైన యెరీబై యోషవ్యా, మోయాబీయుడైన ఇత్మా, ఎలీయేలు, ఓబేదు, మెజోబాయా వాడైన యయశీయేలు.

1 దినవృత్తాంతములు 11:20-47 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

యోవాబు సోదరుడైన అబీషై ముగ్గురికీ నాయకుడు. ఒక యుద్ధంలో ఇతడు మూడు వందల మందిని కేవలం తన ఈటెతో హతమార్చాడు. అలా ఆ ముగ్గురితో పాటు తరచుగా ఇతని పేరు కూడా వినిపించేది. ముగ్గురిలో ఇతనికి ఎక్కువ గౌరవం, కీర్తీ కలిగాయి. అయితే అతనికి కలిగిన కీర్తి పేరు మోసిన ఆ ముగ్గురు సైనికుల కీర్తికి సాటి కాలేదు. ఇంకా కబ్సెయేలు ఊరివాడు యెహోయాదా కొడుకు బెనాయా ఎంతో బలవంతుడు. తన పరాక్రమ కార్యాల వల్ల ఇతడు ఎంతో ప్రసిద్ధికెక్కాడు. ఇతడు మోయాబు వాడు అరీయేలు కొడుకులిద్దర్నీ చంపాడు. ఇంకా ఇతడు మంచు పడే కాలంలో ఒక బిలంలోకి దిగి అక్కడ ఒక సింహాన్ని చంపివేశాడు. ఒకసారి ఇతను ఏడున్నర అడుగుల ఎత్తున్న ఒక ఐగుప్తీయున్నిచంపాడు. ఆ ఐగుప్తీయుడి చేతిలో సాలెవాడి దండె అంత పెద్ద ఈటె ఉంది. బెనాయా వాడి మీదికి ఒక కర్ర పట్టుకుని వెళ్ళాడు. ఆ ఈటెను ఐగుప్తీయుడి చేతిలోనుండి లాక్కుని దానితోనే వాణ్ణి చంపివేశాడు. ఇలాంటి ఘన కార్యాలు చేసిన యెహోయాదా కొడుకైన బెనాయా పేరు ఆ ముగ్గురు బలవంతుల పేర్లలో చేర్చారు. ముప్ఫై మంది సైనికుల్లో అతణ్ణి గొప్పవాడిగా ఎంచారు, కానీ పేరు మోసిన ఆ ముగ్గురు వీరులకు సాటి కాలేదు. కానీ దావీదు ఇతణ్ణి అంగ రక్షకులపై అధిపతిగా నియమించాడు. ఆ యోధులు ఎవరంటే యోవాబు తమ్ముడు అశాహేలు, బేత్లెహేము ఊరివాడు దోదో కొడుకైన ఎల్హానాను, హరోరీయుడైన షమ్మోతు, పెలోనీయుడైన హేలెస్సు, తెకోవీయుడైన ఇక్కేషు కొడుకైన ఈరా, అన్నేతోతీయుడైన అబీయెజెరు, హుషాతీయుడైన సిబ్బెకై, అహోహీయుడైన ఈలై, నెటోపాతీయుడైన మహరై, నెటోపాతీయుడైన బయనా కొడుకు హేలెదు, బెన్యామీను సంతతికి చెందిన గిబియా ఊరివాడు రీబై కొడుకు ఈతయి, పిరాతోనీయుడు బెనాయా, గాయషు లోయకు చెందిన హూరై, అర్బాతీయుడైన అబీయేలు, బహరూమీయుడు అజ్మావెతు, షయల్బోనీయుడైన ఎల్యాహ్బా, గిజోనీయుడైన హాషేము కొడుకులూ, హరారీయుడైన షాగే కొడుకైన యోనాతాను, హరారీయుడైన శాకారు కొడుకైన అహీయాము, ఊరు కొడుకు ఎలీపాలు, మెకేరాతీయుడైన హెపెరు, పెలోనీయుడైన అహీయా, కర్మెలీయుడైన హెజ్రో, ఎజ్బయి కొడుకైన నయరై, నాతాను సోదరుడైన యోవేలు, హగ్రీయుడైన మిబ్హారు, అమ్మోనీయుడైన జెలెకు, సెరూయా కొడుకైన యోవాబు ఆయుధాలు మోసేవాడూ బెరోతీయుడూ అయిన నహరై, ఇత్రీయుడైన ఈరా, ఇత్రీయుడైన గారేబు, హిత్తీయుడైన ఊరియా, అహ్లయి కొడుకైన జాబాదు, రూబేనీయుడైన షీజా కొడుకూ, రూబేనీయులకు నాయకుడూ అయిన అదీనా, అతని తోటి వారైన ముప్ఫై మందీ, మయకా కొడుకైన హానాను, మిత్నీయుడైన యెహోషాపాతు, ఆష్తెరాతీయుడైన ఉజ్జీయా, అరొయేరీయుడైన హోతాను కొడుకులు షామా యెహీయేలు, షిమ్రీ కొడుకైన యెదీయవేలు, అతని సోదరుడూ, తిజీయుడూ అయిన యోహా, మహవీయుడైన ఎలీయేలు, ఎల్నయము కొడుకులైన యెరీబై యోషవ్యా, మోయాబు వాడు ఇత్మా, ఎలీయేలు, ఓబేదు, మెజోబాయా ఊరివాడు యహశీయేలు అనే వాళ్ళు.

1 దినవృత్తాంతములు 11:20-47 పవిత్ర బైబిల్ (TERV)

ముగ్గురు యోధుల దళానికి యోవాబు సోదరుడు అబీషై నాయకుడు. అతడు మూడు వందల మందిని తన ఈటెతో ఎదిరించి చంపాడు. ఆ ముగ్గురు యోధుల్లాగా అబీషై కీర్తి గడించాడు. కాని అతనికి మిగిలిన వారికంటె ఎక్కువ గౌరవం దక్కింది. ముగ్గురిలో ఒకడు కాకపోయినా అతడు అధిపతి అయ్యాడు. యోహోయాదా కుమారుడు బెనాయా ఒక పరాక్రమవంతుని కుమారుడు. అతడు కబ్సెయేలు వంశంవాడు. అతడు కొన్ని సాహస కార్యాలు నెరవేర్చాడు. మోయాబు దేశానికి చెందిన ఇద్దరు గొప్ప యోధులను చంపాడు. అతడు భూమిలో పెద్ద గోతిలోకి వెళ్లి అక్కడ ఒక సింహాన్ని చంపాడు. అది బాగా మంచుపడే రోజున జరిగింది. ఈజిప్టుకు చెందిన బలవంతుడైన సైనికుని కూడ బెనాయా చంపాడు. ఆ మనుష్యుడు ఏడున్నర అడుగుల ఎత్తుగల వాడు. ఆ ఈజిప్టు వాని వద్ద అతి పెద్దదయిన, బరువైన ఒక ఈటె వుంది. అది నేత నేయువాని మగ్గం దోనెవలె వుంది. బెనాయా వద్ద ఒక గదలాంటి ఆయుధం మాత్రమే వుంది. కాని బెనాయా ఆ ఈజిప్టు వాని వద్ద నుండి ఈటెను లాక్కున్నాడు. దానితోనే వానిని చంపివేశాడు. ఇవన్నీ యోహోయాదా కుమారుడు బెనాయా చేసిన పనులు. ముగ్గురు యోధుల్లాగా బెనాయా పేరు పొందిన వ్యక్తి అయ్యాడు. ఆ ముగ్గురి యోధుల కంటె బెనాయాకు ఎక్కువ గౌరవం లభించింది. కాని అతడు ఆ ముగ్గురిలో చేర్చబడలేదు. దావీదు తన అంగరక్షకులకు అధిపతిగా బెనాయాను నియమించాడు. ముఫ్పై మంది వీరులైన సైనికులెవరనగా: యోవాబు సోదరుడైన ఆశాహేలు. దోదో కుమారుడైన ఎల్హానాను. ఎల్హానాను బేత్లెహేము నివాసి. హరోరీయుడైన షమ్మోతు. పెలోనీయుడైన హేలెస్సు. ఇక్కీషు కుమారుడైన ఈరా. ఈరా తెకోవ పట్టణానికి చెందినవాడు. అనాతోతీయుడైన అబీయెజెరు. హుషాతీయుడైన సిబ్బెకై. అహోహీయుడైన ఈలై. నెటోపాతీయుడగు మహరై, బయనా కుమారుడగు హేలెదు. హేలెదు కూడ నెటోపాతీయుడు. రీబయి కుమారుడైన ఈతయి. ఈతయి అనేవాడు బెన్యామీను దేశంలోని గిబియా పట్టణవాసి. పిరాతోనీయుడైన బెనాయా, గాయషులోయవాడైన హురై, అర్బాతీయుడైన అబీయేలు, బహరూమీయుడైన అజ్మావెతు. షయిల్బోనీయుడైన ఎల్యాహ్బా హాషేము కుమారులు గిజోనీయుడుగు షాగే కుమారుడు యోనాతాను. యోనాతాను హరారీయుడు. శాకారు కుమారుడు అహీయాము. అహీయాము హరారీయుడు. ఊరు కుమారుడు ఎలీపాలు. మెకేరాతీయుడైన హెపెరు. పెలోనీయుడగు అహీయా. కర్మెలీయుడైన హెజ్రో. ఎజ్బయి కుమారుడైన నయరై. నాతాను సోదరుడైన యోవేలు. హగ్రీ కుమారుడగు మిబ్హారు. అమ్మోనీయుడగు జెలెకు. బెరోతీయుడగు నహరై. యోవాబు ఆయుధాలు మోసేవాడు. యోవాబు తండ్రి పేరు సెరూయా. ఇత్రీయుడైన ఈరా. ఇత్రీయుడగు గారేబు. హిత్తీయుడైన ఊరియా. అహ్లయి కుమారుడు జాబాదు. షీజా కుమారుడు అదీనా. షీజా అనేవాడు రూబేనీయుడు. అదీనా రూబేను వంశంలో పెద్ద. అతను తనతోవున్న ముగ్గురు యోధులకు నాయకుడు. మయకా కుమారుడు హానాను. మిత్నీయుడైన యెహోషాపాతు. ఆష్తెరాతీయుడైన ఉజ్జీయా. హోతాము కుమారులు షామా, యెహీయేలు. హోతాము అరోయేరీయుడు. షిమ్రీ కుమారుడు యెదీయవేలు. తిజీయుడగు యోహా. యెదీయవేలు సోదరుడు యోహా. మహవీయుడగు ఎలీయేలు. ఎల్నయము కుమారులైన యెరీబై, యోషవ్యా. మోయాబీయుడైన ఇత్మా. ఎలీయేలు, ఓబేదు, మరియు మెజోబాయా వాడైన యహశీయేలు.

1 దినవృత్తాంతములు 11:20-47 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

యోవాబు సహోదరుడైన అబీషై ముగ్గురిలో ప్రధానుడు; ఇతడు ఒక యుద్ధమందు మూడువందలమందిని హతముచేసి తన యీటె వారిమీద ఆడించినవాడై యీ ముగ్గురిలోను పేరుపొందిన వాడాయెను. ఈ ముగ్గురిలోను కడమ యిద్దరికంటె అతడు ఘనతనొందినవాడై వారికి అధిపతియాయెనుగాని ఆ మొదటి ముగ్గురిలో ఎవరికిని అతడు సాటివాడు కాలేదు. మరియు కబ్సెయేలు సంబంధుడును పరాక్రమవంతుడునైన యొకనికి పుట్టిన యెహోయాదా కుమారుడైన బెనాయాయును విక్రమక్రియలవలన గొప్ప వాడాయెను. ఇతడు మోయాబీయుడగు అరీయేలు కుమారులనిద్దరిని చంపెను; మరియు ఇతడు బయలుదేరి హిమము పడిన కాలమున ఒక సింహమును ఒక గుహయందు చంపి వేసెను. అయిదు మూరల పొడవుగల మంచియెత్తరియైన ఐగుప్తీయుని ఒకని అతడు చావగొట్టెను; ఆ ఐగుప్తీయుని చేతిలో నేతగాని దోనెవంటి యీటె యొకటి యుండగా ఇతడు ఒక దుడ్డుకఱ్ఱ చేతపట్టుకొని వానిమీదికిపోయి ఆ యీటెను ఐగుప్తీయుని చేతిలోనుండి ఊడలాగి దానితో వానిని చంపెను. యెహోయాదా కుమారుడైన బెనాయా యిట్టి పనులు చేసినందున ఆ ముగ్గురు పరాక్రమశాలులలో ఘనతనొందిన వాడాయెను. ముప్పదిమందిలోను ఇతడు వాసికెక్కెనుగాని ఆ ముగ్గురిలో ఎవరికిని సాటివాడు కాలేదు; దావీదు ఇతనిని తన దేహసంరక్షకులకధిపతిగా ఉంచెను. మరియు సైన్యములకు చేరిన వేరు పరాక్రమశాలు లెవరనగా యోవాబు తమ్ముడైన అశాహేలు; బేత్లెహేము ఊరివాడైన దోదో కుమారుడగు ఎల్హానాను, హరోరీయుడైన షమ్మోతు, పెలోనీయుడైన హేలెస్సు, తెకోవీయుడైన ఇక్కేషు కుమారుడగు ఈరా, అన్నేతోతీయుడైన అబీయెజెరు, హుషాతీయుడైన సిబ్బెకై, అహోహీయుడైన ఈలై, నెటోపాతీయుడైన మహరై, నెటోపాతీయుడైన బయనా కుమారుడగు హేలెదు, బెన్యామీనీయుల స్థానములోని గిబియా ఊరివాడును రీబై కుమారుడునగు ఈతయి, పిరాతోనీయుడైన బెనాయా, గాయషులోయవాడైన హూరై, అర్బా తీయుడైన అబీయేలు, బహరూమీయుడైన అజ్మావెతు, షయిల్బోనీయుడైన ఎల్యాహ్బా, గిజోనీయుడైన హాషేము కుమారులు, హరారీయుడైన షాగే కుమారుడగు యోనాతాను, హరారీయుడైన శాకారు కుమారుడగు అహీయాము, ఊరు కుమారుడైన ఎలీపాలు, మెకేరాతీయుడైన హెపెరు, పెలోనీయుడైన అహీయా, కర్మెలీయుడైన హెజ్రో, ఎజ్బయి కుమారుడైన నయరై, నాతాను సహోదరుడైన యోవేలు, హగ్రీయుడైన మిబ్హారు, అమ్మోనీయుడైన జెలెకు,సెరూయా కుమారుడై యోవాబుయొక్క ఆయుధములు మోయువాడును బెరోతీయుడునగు నహరై, ఇత్రీయుడైన ఈరా, ఇత్రీయుడైన గారేబు, హిత్తీయుడైన ఊరియా, అహ్లయి కుమారుడైన జాబాదు, రూబేనీయుడైన షీజా కుమారుడును రూబే నీయులకు పెద్దయునైన అదీనా, అతనితోటివారగు ముప్పదిమంది, మయకా కుమారుడైన హానాను, మిత్నీ యుడైన యెహోషాపాతు, ఆష్తెరాతీయుడైన ఉజ్జీయా, అరొయేరీయుడైన హోతాను కుమారులగు షామా యెహీయేలు, షిమ్రీ కుమారుడైన యెదీయవేలు, తిజీయుడైన వాని సహోదరుడగు యోహా, మహవీయుడైన ఎలీయేలు, ఎల్నయము కుమారులైన యెరీబై యోషవ్యా, మోయాబీయుడైన ఇత్మా, ఎలీయేలు ఓబేదు, మెజో బాయా ఊరివాడైన యహశీయేలు.

1 దినవృత్తాంతములు 11:20-47 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)