రోమా పత్రిక 8:11-17

రోమా పత్రిక 8:11-17 OTSA

యేసును మరణం నుండి సజీవంగా లేపిన దేవుని ఆత్మ మీలో నివసిస్తూ ఉంటే, క్రీస్తును మరణం నుండి సజీవంగా లేపిన ఆయన నాశనమయ్యే మీ శరీరాలకు కూడా మీలో నివసిస్తున్న తన ఆత్మ ద్వారా జీవాన్ని ఇవ్వగలరు. కాబట్టి సహోదరి సహోదరులారా, శరీరానుసారంగా జీవించడానికి మనం శరీరానికి రుణస్థులము కాము. మీరు శరీరానుసారంగా జీవిస్తే మీరు మరణిస్తారు. కాని ఒకవేళ ఆత్మ ద్వారా శరీర సంబంధమైన చెడ్డక్రియలను చంపివేస్తే మీరు బ్రతుకుతారు. ఎవరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారే దేవుని బిడ్డలు. మీరు మరలా భయంలో జీవించడానికి, మీరు పొందిన ఆత్మ మిమ్మల్ని బానిసలుగా చేయదు కాని మీరు పొందిన ఆత్మ ద్వారా దత్తపుత్రులుగా చేయబడతారు. అప్పుడు ఆ ఆత్మ ద్వారా మనం, “అబ్బా, తండ్రీ” అని మొరపెడుతున్నాము. మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో సాక్ష్యమిస్తున్నాడు. మనం పిల్లలమైతే వారసులం, అంటే దేవుని వారసులం; క్రీస్తు మహిమను మనం కూడా పొందడానికి ఆయనతో శ్రమపడితే క్రీస్తు సహ వారసులమవుతాం.

రోమా పత్రిక 8:11-17 కోసం వీడియో