యెహోవా, నేను నా హృదయమంతటితో మిమ్మల్ని స్తుతిస్తాను; మీ అద్భుతమైన క్రియల గురించి నేను చెప్తాను. మీలో నేను ఆనందించి సంతోషిస్తాను; ఓ మహోన్నతుడా, మీ నామాన్ని బట్టి నేను స్తుతులు పాడతాను. నా శత్రువులు వెనుకకు తిరుగుతారు; మీ ముందు వారు తడబడి నశిస్తారు. నీతిమంతుడవైన న్యాయమూర్తిగా సింహాసనంపై కూర్చుని, నా పక్షంగా న్యాయం తీర్చుతున్నారు. మీరు దేశాలను మందలించి దుష్టులను నిర్మూలం చేశారు; మీరు వారి పేరును ఎప్పటికీ లేకుండ తుడిచివేశారు. అంతులేని పతనం నా శత్రువులు పతనమై పూర్తిగా నశిస్తారు, మీరు వారి పట్టణాలను పెల్లగించారు; వాటి జ్ఞాపకం కూడా చెరిగిపోతుంది. యెహోవా నిరంతరం పరిపాలిస్తారు; తీర్పు కోసం ఆయన తన సింహాసనాన్ని స్థాపించారు. ఆయన నీతితో లోకాన్ని పరిపాలిస్తారు ఆయన దేశాలను న్యాయంగా తీర్పు తీరుస్తారు. అణచివేయబడిన వారికి యెహోవా ఆశ్రయం, కష్ట సమయాల్లో బలమైన కోట. మీ నామం తెలిసిన వారు మీమీద నమ్మకం ఉంచుతారు, ఎందుకంటే యెహోవా, మిమ్మల్ని వెదికే వారిని మీరు ఎన్నడూ విడువరు. సీయోనులో సింహాసనాసీనుడైయున్న యెహోవాను గురించి స్తుతులు పాడండి; దేశాల మధ్య ఆయన చేసిన వాటిని ప్రకటించండి. ఎందుకంటే రక్తానికి ప్రతీకారం తీర్చుకునేవాడు జ్ఞాపకముంచుకుంటాడు; బాధితుల మొరను ఆయన విస్మరించరు.
చదువండి కీర్తనలు 9
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: కీర్తనలు 9:1-12
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు