కీర్తనలు 88

88
కీర్తన 88
ఒక గీతము. కోరహు కుమారుల కీర్తన. సంగీత దర్శకునికి. మహలతు లయన్నోత్ అనే రాగం మీద పాడదగినది. ఎజ్రాహీయుడైన హేమాను ధ్యానకీర్తన.
1యెహోవా, మీరు నన్ను రక్షించే దేవుడు;
రాత్రింబగళ్ళు నేను మీకు మొరపెడతాను.
2నా ప్రార్థనలు మీ ఎదుటకు వచ్చును గాక;
చెవియొగ్గి నా మొర ఆలకించండి.
3నేను ఇబ్బందుల్లో మునిగి ఉన్నాను
నా ప్రాణం మరణానికి చేరువగా ఉంది.
4సమాధికి వెళ్లే వారితో నేను లెక్కించబడ్డాను;
నేను బలం లేనివాడిలా ఉన్నాను.
5సమాధిలో పడి ఉన్న హతులైనవారిలా,
నేను చచ్చినవారితో విడిచిపెట్టబడ్డాను,
వారిని మీరు ఎన్నటికి జ్ఞాపకముంచుకోరు,
వారు మీ సంరక్షణ నుండి తొలగిపోయారు.
6మీరు నన్ను లోతైన గుంటలో,
చీకటి గుంటలో ఉంచారు.
7మీ ఉగ్రత నా మీద భారంగా ఉంది;
మీ అలలతో నన్ను ముంచివేశారు. సెలా
8నా దగ్గరి స్నేహితులను నా నుండి దూరం చేశారు
నన్ను వారికి అసహ్యమైన వానిగా చేశారు.
నేను నిర్బంధించబడ్డాను నేను తప్పించుకోలేను;
9దుఃఖంతో నా కళ్లు మసకబారాయి.
యెహోవా, ప్రతిరోజు నేను మీకు మొరపెడుతున్నాను;
మీ వైపు నా చేతులు చాచాను.
10మృతులకు మీరు అద్భుతాలు చూపిస్తారా?
వారి ఆత్మలు లేచి మిమ్మల్ని స్తుతిస్తాయా? సెలా
11సమాధిలో మీ మారని ప్రేమ ప్రకటించబడుతుందా?
నాశనకూపంలో#88:11 హెబ్రీలో అబద్దోను మీ నమ్మకత్వం ప్రకటించబడుతుందా?
12చీకటి స్థలంలో మీ అద్భుతాలు తెలుస్తాయా?
మరుపుకు గురియైన దేశంలో మీ నీతి క్రియలు తెలుస్తాయా?
13కాని యెహోవా, నేను సహాయం కోసం మీకు మొరపెడతాను;
ఉదయం నా ప్రార్థన మీ ఎదుటకు వస్తుంది.
14యెహోవా, మీరు ఎందుకు నన్ను తృణీకరిస్తూ
నా నుండి మీ ముఖాన్ని దాచుకుంటున్నారు?
15నా యవ్వనం నుండి నేను బాధను అనుభవించి మరణానికి దగ్గరగా ఉన్నాను;
నేను మీ భయాలను భరించి నిరాశలో ఉన్నాను.
16మీ ఉగ్రత నన్ను ముంచేసింది;
మీ భయాలు నన్ను నిర్మూలం చేశాయి.
17అవి రోజంతా ప్రవాహంలా నన్ను చుట్టుముట్టాయి;
అవి నన్ను పూర్తిగా ముంచేశాయి.
18నా స్నేహితులను నా పొరుగువారిని నాకు దూరం చేశారు
చీకటే నాకు దగ్గరి స్నేహితుడు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

కీర్తనలు 88: OTSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి

కీర్తనలు 88 కోసం వీడియో