కీర్తనలు 51:10-18

కీర్తనలు 51:10-18 OTSA

ఓ దేవా, నాలో శుద్ధహృదయాన్ని సృష్టించండి, నాలో స్థిరమైన ఆత్మను నూతనంగా పుట్టించండి. మీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకండి, మీ పరిశుద్ధాత్మను నా నుండి తొలగించకండి. మీ రక్షణానందం నాకు తిరిగి చేకూర్చండి, నన్ను సంరక్షించడానికి నాకు సమ్మతిగల ఆత్మను ఇవ్వండి. అప్పుడు అతిక్రమం చేసేవారికి మీ మార్గాలను బోధిస్తాను, తద్వార పాపులు మీ దగ్గరకు తిరిగి వస్తారు. మీరు దేవుడు, నా రక్షకుడు, ఓ దేవా, రక్తాపరాధం నుండి నన్ను విడిపించండి, నా నాలుక మీ నీతిని గురించి పాడుతుంది. ప్రభువా, నా పెదవులను తెరవండి, నా నోరు మీ స్తుతిని ప్రకటిస్తుంది. మీరు బలులను బట్టి ఆనందించరు, లేకపోతే నేను తెచ్చేవాన్ని; మీరు దహనబలులను ఇష్టపడరు. విరిగిన ఆత్మ దేవునికి ఇష్టమైన బలి; పశ్చాత్తాపంతో విరిగిన హృదయాన్ని దేవా, మీరు నిరాకరించరు. మీ దయతో సీయోనుకు మంచి చేయండి; యెరూషలేము గోడలు కట్టించండి.