ఓ దేవా, మీ మారని ప్రేమను బట్టి నన్ను కరుణించండి; మీ గొప్ప కనికరాన్ని బట్టి, నా పాపాలను తుడిచివేయండి. నా దోషాలన్నింటిని కడిగి, నా పాపము నుండి నన్ను శుభ్రపరచండి. నా అతిక్రమాలు నాకు తెలుసు నా పాపం ఎల్లప్పుడు నా కళ్లెదుటే ఉంది. కేవలం మీకు, మీకే విరోధంగా నేను పాపం చేశాను, మీ దృష్టికి చెడు చేశాను; మీ తీర్పులో మీరు సరిగ్గా ఉంటారు మీరు తీర్పు తీర్చునప్పుడు న్యాయసమ్మతంగా ఉంటుంది. నేను పాపిగా పుట్టాను, నా తల్లి నన్ను గర్భం దాల్చినప్పుడు నేను పాపిని. మీరు అంతరంగంలో నిజాయితీ కోరతారు; ఆ రహస్య ప్రదేశంలో మీరు నాకు జ్ఞానం బోధించారు. హిస్సోపుతో నన్ను శుద్ధీకరించండి, నేను శుద్ధునిగా ఉంటాను; నన్ను కడగండి, నేను హిమము కంటే తెల్లగా ఉంటాను. నన్ను ఆనందాన్ని సంతోషాన్ని విననివ్వండి; మీరు విరిచిన ఎముకలను సంతోషించనివ్వండి. నా పాపముల నుండి మీ ముఖాన్ని దాచండి నా దోషమంతటిని తుడిచివేయండి. ఓ దేవా, నాలో శుద్ధహృదయాన్ని సృష్టించండి, నాలో స్థిరమైన ఆత్మను నూతనంగా పుట్టించండి. మీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకండి, మీ పరిశుద్ధాత్మను నా నుండి తొలగించకండి. మీ రక్షణానందం నాకు తిరిగి చేకూర్చండి, నన్ను సంరక్షించడానికి నాకు సమ్మతిగల ఆత్మను ఇవ్వండి.
Read కీర్తనలు 51
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: కీర్తనలు 51:1-12
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు