కీర్తనలు 26
26
కీర్తన 26
దావీదు కీర్తన.
1యెహోవా, నేను నిందారహితునిగా జీవించాను,
నాకు న్యాయం తీర్చండి;
నేను ఏ సందేహం లేకుండ
యెహోవాను నమ్మాను.
2యెహోవా, నన్ను పరిశీలించండి, నన్ను పరీక్షించండి,
నా హృదయాన్ని నా మనస్సును పరీక్షించండి;
3నేను నిరంతరం మీ మారని ప్రేమను జ్ఞాపకముంచుకుంటాను
మీ సత్యానికి అనుగుణంగా నడుచుకుంటాను.
4నేను మోసగాళ్ళతో కూర్చోను,
వేషధారులతో నేను సహవాసం చేయను.
5కీడుచేసేవారి గుంపు నాకు అసహ్యం
దుష్టులతో నేను కూర్చోను.
6-7యెహోవా, నిర్దోషినని నా చేతులు కడుక్కుని,
బిగ్గరగా మీ స్తుతిని ప్రకటిస్తూ
మీ అద్భుత క్రియలన్నిటిని గురించి చెబుతూ
మీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణం చేస్తాను.
8యెహోవా, మీరు నివసించే ఆవరణం,
మీ మహిమ నివసించే స్థలం అంటే నాకు ఇష్టము.
9పాపులతో పాటు నా ప్రాణాన్ని
నరహంతకులతో పాటు నా బ్రతుకును తుడిచివేయకండి.
10వారి చేతుల్లో దుష్ట పన్నాగాలు ఉన్నాయి,
వారి కుడి చేతులు లంచాలతో నిండి ఉన్నాయి.
11నేను నిందారహితంగా బ్రతుకుతాను;
నన్ను విమోచించండి నన్ను కరుణించండి.
12నా పాదాలను సమతలమైన నేల మీద నిలిపాను;
గొప్ప సమాజాలలో నేను యెహోవాను స్తుతిస్తాను.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
కీర్తనలు 26: OTSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.