సామెతలు 13

13
1జ్ఞానం కలిగిన కుమారుడు తన తండ్రి క్రమశిక్షణ అంగీకరిస్తాడు,
కాని ఎగతాళి చేసేవాడు గద్దింపుకు లోబడడు.
2తమ పెదవుల ఫలం నుండి ప్రజలు మేలైన వాటిని ఆస్వాదిస్తారు,
కాని నమ్మకద్రోహులు హింస పట్ల ఆకలిగొని ఉంటారు.
3తమ పెదవులను కాచుకునేవారు తమ ప్రాణాలు కాపాడుకుంటారు,
కాని దురుసుగా మాట్లాడేవారు పతనమవుతారు.
4సోమరి ఆకలి ఎన్నటికి తీరదు,
కాని శ్రద్ధగా పని చేసేవారు తృప్తి చెందుతారు.
5నీతిమంతులు అబద్ధమైన దానిని అసహ్యించుకుంటారు,
దుర్మార్గులు తమను తాము దుర్గంధం చేసుకుంటారు
తమ మీదికి అవమానం తెచ్చుకుంటారు.
6నీతి నిజాయితీగల వ్యక్తిని కాపాడుతుంది,
కాని దుష్టత్వం పాపిని పడగొడుతుంది.
7కొందరు ఏమి లేకపోయినా ధనవంతులుగా నటిస్తారు;
మరికొందరు బాగా ధనము కలిగి ఉండి కూడా, పేదవారిగా నటిస్తారు.
8ఒకని ఐశ్వర్యం వారి ప్రాణాన్ని విమోచించవచ్చు,
కాని పేదవాడు బెదిరింపు మాటలను వినడు.
9నీతిమంతుల వెలుగు అంతకంతకు ప్రకాశించును,
కాని దుర్మార్గుల దీపం ఆరిపోతుంది.
10గర్వము ఉన్నచోట తగాదా ఉంటుంది,
కాని సలహా తీసుకునేవారికి జ్ఞానము దొరుకుతుంది.
11నిజాయితీ లేని డబ్బు తగ్గిపోతుంది,
కాని కష్టపడి సంపాదించేవారు డబ్బును దానిని ఎక్కువ చేసుకుంటారు.
12వాయిదా వేయబడిన ఆశ హృదయానికి జబ్బు కలిగిస్తుంది,
అయితే కోరిక తీరుట జీవవృక్షము.
13బోధను ఎగతాళి చేసేవారు తగిన మూల్యం చెల్లిస్తారు,
కాని ఆజ్ఞను గౌరవించేవారు ఫలం పొందుతారు.
14జ్ఞానుల బోధ ఒక జీవపుఊట,
అది ఓ వ్యక్తిని మరణ ఉరుల నుండి తప్పిస్తుంది.
15మంచి తీర్పు దయను గెలుస్తుంది,
కాని నమ్మకద్రోహుల మార్గం వారి నాశనానికి దారితీస్తుంది.
16వివేకులైనవారందరు తెలివితో వ్యవహరిస్తారు,
కాని మూర్ఖులు వారి మూర్ఖత్వాన్ని బహిర్గతం చేస్తారు.
17దుష్టులైన దూతలు కీడు చేయడానికి లోబడతారు,
నమ్మకమైన రాయబారులు స్వస్థత కలిగిస్తారు.
18శిక్షను తిరస్కరించేవారికి అవమానం దారిద్ర్యం కలుగుతాయి
అయితే దిద్దుబాటును స్వీకరించేవారు ఘనత పొందుతారు.
19ఆశ తీరుట వలన ప్రాణానికి తీపి
చెడుతనాన్ని విడిచిపెట్టడం బుద్ధిలేనివారికి అసహ్యము.
20జ్ఞానులతో స్నేహం చేసేవారు జ్ఞానులవుతారు
బుద్ధిలేనివారితో స్నేహం చేసేవారు చెడిపోతారు.
21కష్టం పాపులను వెంటాడుతుంది,
నీతిమంతులకు మేలు ప్రతిఫలంగా వచ్చును.
22మంచివారు తన పిల్లల పిల్లలకు ఆస్తులు ఉంచుతారు,
పాపుల ఆస్తి నీతిమంతులకు ఉంచబడుతుంది.
23దున్నబడని క్రొత్త భూమి పేదవారికి పంటనిస్తుంది
కాని అన్యాయస్థులు రు.
24బెత్తం వాడని తండ్రి తన కుమారునికి విరోధి
కుమారుని ప్రేమించేవాడు వానిని శిక్షిస్తాడు.
25నీతిమంతులు కడుపునిండా భోజనం చేస్తారు,
కానీ దుష్టులైన వారి కడుపు నిండదు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

సామెతలు 13: OTSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి