యోబు 16
16
యోబు
1అప్పుడు యోబు ఇచ్చిన జవాబు:
2నేను ఇలాంటి విషయాలెన్నో విన్నాను;
మీరందరు నీచంగా ఓదార్చేవారు.
3మీ గాలిమాటలకు అంతం లేదా?
మీరు ఇలాంటి సమాధానం ఇచ్చేలా ఏది మిమ్మల్ని బలవంతం చేస్తుంది?
4నేనున్న స్థానంలో మీరు ఉంటే,
నేనూ మీలాగే మాట్లాడగలను;
మీకు వ్యతిరేకంగా ఎన్నో మాటలు మాట్లాడి
మిమ్మల్ని చూసి తల ఊపుతూ ఎగతాళి చేయగలను.
5కాని నా నోటి మాట మిమ్మల్ని బలపరుస్తుంది;
నా పెదవుల నుండి వచ్చే ఆదరణ మీకు ఉపశమనం కలిగిస్తుంది.
6అయితే నేను మాట్లాడినప్పటికి నా బాధకు ఉపశమనం లేదు;
మౌనంగా ఉన్నా నా బాధ తీరదు.
7దేవా, నాకు అలసట కలిగించారు;
నా కుటుంబమంతటిని వినాశనం చేశారు.
8మీరు నన్ను అస్థిపంజరంలా చేశారు అది నాకు వ్యతిరేకంగా సాక్ష్యమిస్తుంది;
బక్కచిక్కిన నా దేహం నాకు వ్యతిరేకంగా సాక్ష్యమిస్తుంది.
9దేవుడు తన కోపంలో నా మీద దాడి చేసి నన్ను చీల్చివేశారు;
ఆయన నా వైపు చూస్తూ పళ్ళు కొరుకుతున్నారు;
నాకు శత్రువై నాపై కన్నెర్ర చేసి నావైపు కోపంగా చూస్తున్నారు.
10ప్రజలు నన్ను ఎత్తిపొడవడానికి వారి నోళ్ళు తెరిచారు;
నన్ను తిట్టి చెంపదెబ్బలు కొడుతున్నారు.
నాకు వ్యతిరేకంగా వారంతా ఒక్కటైయ్యారు.
11దేవుడు నన్ను భక్తిహీనులకు అప్పగించారు.
దుర్మార్గుల చేతుల్లో నన్ను పడవేశారు.
12నేను నెమ్మది కలిగి ఉండేవాన్ని, కాని ఆయన నన్ను ముక్కలుగా చేశారు;
నా మెడ పట్టుకుని విదిలించి నన్ను నలిపేశారు.
ఆయన నన్ను తన గురిగా పెట్టుకున్నారు;
13ఆయన బాణాలు నన్ను చుట్టుకున్నాయి
జాలి లేకుండ ఆయన నా మూత్రపిండాల గుండా గుచ్చారు
నా పైత్యరసాన్ని నేలపై పారబోశారు.
14పదే పదే ఆయన నన్ను విరుచుకుపడ్డారు;
శూరునిలా పరుగున నా మీద పడ్డారు.
15నా చర్మం మీద గోనెపట్ట కుట్టుకున్నాను
నా నుదిటిని#16:15 మూ.భా.లో కొమ్ము దుమ్ములో ఉంచాను.
16ఏడ్పుచేత నా ముఖం ఎరుపెక్కింది
నా కనురెప్పల మీద చీకటి నీడలు ఉన్నాయి;
17అయినా నా చేతులు దౌర్జన్యానికి దూరంగా ఉన్నాయి,
నా ప్రార్థనలు యథార్థంగా ఉన్నాయి.
18భూమీ, నా రక్తాన్ని కప్పివేయకు;
నా మొర ఎప్పుడూ వినిపిస్తూనే ఉండాలి.
19ఇప్పుడు కూడా నా సాక్షి పరలోకంలో ఉన్నాడు;
నా న్యాయవాది పైన ఉన్నాడు.
20నా కళ్లు దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తుండగా
నా మధ్యవర్తి నా స్నేహితుడు#16:20 లేదా నా స్నేహితులు అపహాస్యం చేస్తారు
21ఒకడు స్నేహితుని కోసం వేడుకున్నట్లు
అతడు నరుని పక్షాన దేవున్ని వేడుకుంటాడు.
22ముందున్నవి ఇంకా కొన్ని సంవత్సరాలే
తర్వాత నేను తిరిగి రాలేని మార్గంలో వెళ్తాను.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యోబు 16: OTSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.