యిర్మీయా 7:1-8

యిర్మీయా 7:1-8 OTSA

యెహోవా నుండి యిర్మీయాకు వచ్చిన వాక్కు ఇది: “యెహోవా ఆలయ ద్వారం దగ్గర నిలబడి, అక్కడ ఈ సందేశాన్ని ప్రకటించండి: “ ‘యెహోవాను ఆరాధించడానికి ఈ ద్వారాల గుండా వచ్చే సర్వ యూదా ప్రజలారా, యెహోవా చెప్తుంది వినండి. సైన్యాల యెహోవాయైన ఇశ్రాయేలు దేవుడు ఇలా అంటున్నారు: నీ మార్గాలను, నీ క్రియలను సరిచేసుకో, అప్పుడు నేను నిన్ను ఈ స్థలంలో నివాసం చేయిస్తాను. మోసపూరిత మాటలను నమ్మకండి, “ఇది యెహోవా మందిరం, యెహోవా మందిరం, యెహోవా మందిరం!” మీరు నిజంగా మీ మార్గాలను, మీ క్రియలను మార్చుకుని ఒకరితో ఒకరు న్యాయంగా వ్యవహరిస్తే, మీరు విదేశీయులను, తండ్రిలేనివారిని లేదా విధవరాండ్రను అణచివేయకుండ, ఈ స్థలంలో నిర్దోషుల రక్తాన్ని చిందించకుండ, మీకు హాని కలిగించే విధంగా ఇతర దేవుళ్ళను అనుసరించకుండా ఉంటే, నేను మీ పూర్వికులకు ఇచ్చిన దేశంలో, అంటే ఈ స్థలంలో, మిమ్మల్ని శాశ్వతంగా నివాసం చేయనిస్తాను. కాని చూడండి, మీరు విలువలేని మోసపూరితమైన మాటలు నమ్ముతున్నారు.

Read యిర్మీయా 7