యెహోవా యాకోబుపై జాలి చూపుతారు; ఆయన మరలా ఇశ్రాయేలును ఏర్పరచుకొని వారిని వారి స్వదేశంలో స్థిరపరుస్తారు. విదేశీయులు వారిని కలుసుకుంటారు యాకోబు వారసులతో ఏకమై ఉంటారు. ప్రజలు వారిని తీసుకువచ్చి వారి సొంత దేశంలో వారిని చేర్చుతారు. ఇశ్రాయేలు దేశాలను స్వాధీనపరచుకుని యెహోవా దేశంలో వారిని తమ దాసదాసీలుగా చేసుకుంటారు. వారు తమను బందీలుగా పట్టుకెళ్లిన వారిని బందీలుగా పట్టుకుని తమను బాధించిన వారిని పాలిస్తారు. నీ బాధ నుండి వేదన నుండి నీతో బలవంతంగా చేయించిన కఠినమైన పని నుండి యెహోవా నీకు ఉపశమనం ఇచ్చిన రోజున, నీవు బబులోను రాజును హేళన చేస్తూ ఇలా మాట్లాడతావు: బాధ పెట్టినవాడు ఎలా నశించాడు! రేగుతున్న కోపం ఎలా అంతమయ్యింది! దుర్మార్గుల దుడ్డుకర్రను పాలకుల రాజదండాన్ని యెహోవా విరగ్గొట్టారు. వారు కోపంతో ఎడతెగని దెబ్బలతో ప్రజలను క్రూరంగా కొట్టారు, కోపంతో ప్రజలను పరిపాలించి కనికరం లేకుండా వారిని అణచివేశారు. భూమి అంతా విశ్రాంతిలో సమాధానంతో ఉంది; వారు పాడడం మొదలుపెట్టారు. సరళ వృక్షాలు లెబానోను దేవదారు చెట్లు నీ గురించి సంతోషిస్తూ ఇలా అంటాయి, “నీవు పడుకుంటున్నప్పటి నుండి మమ్మల్ని నరకడానికి ఎవరూ రారు.” నీవు వస్తుండగా నిన్ను కలుసుకోడానికి క్రింద పాతాళం నీ గురించి ఆవేశపడుతుంది; అది నిన్ను చూసి చచ్చిన వారి ఆత్మలను అనగా భూమి మీద నాయకులుగా ఉన్నవారందరిని రేపుతుంది; దేశాలకు రాజులుగా ఉన్నవారందరిని తమ సింహాసనాలు నుండి లేపుతుంది. వారందరు నిన్ను చూసి నీతో ఇలా అంటారు, “నీవు కూడా మాలాగే బలహీనమయ్యావు; నీవు కూడా మాలా అయ్యావు.” నీ వీణల సందడితో పాటు నీ ఆడంబరం అంతా క్రింద సమాధిలో పడవేయబడింది; నీ క్రింద పురుగులు వ్యాపిస్తాయి క్రిములు నిన్ను కప్పివేస్తాయి. తేజోనక్షత్రమా, వేకువచుక్కా, నీవెలా ఆకాశం నుండి పడ్డావు? దేశాలను పడగొట్టిన నీవు భూమి మీద ఎలా పడవేయబడ్డావు? నీవు నీ హృదయంలో, “నేను ఆకాశాలను ఎక్కుతాను; దేవుని నక్షత్రాల కన్నా ఎత్తుగా నా సింహాసనాన్ని హెచ్చిస్తాను; ఉత్తర దిక్కున ఉన్న సభా పర్వతం మీద, సాఫోన్ పర్వతం యొక్క ఎత్తైన స్థలాల మీద కూర్చుంటాను. మేఘ మండలం మీదికి ఎక్కుతాను. నన్ను నేను మహోన్నతునిగా చేసుకుంటాను” అనుకున్నావు. కాని నీవు పాతాళంలో చచ్చిన వారి స్థలంలో లోతైన గోతిలో త్రోయబడ్డావు.
చదువండి యెషయా 14
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: యెషయా 14:1-15
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు