యెహెజ్కేలు 41

41
1అప్పుడతడు నన్ను ప్రధాన ప్రాంగణంలోనికి తీసుకువచ్చి ద్వారబంధాలను కొలిచాడు, వాటి వెడల్పు రెండు వైపులా ఆరు మూరలు#41:1 అంటే సుమారు 3.2 మీటర్లు; 3, 5, 8 వచనాల్లో కూడా ఉంది. 2వాకిలి వెడల్పు పది మూరలు. దానికి రెండు వైపులా ఉన్న గోడల వెడల్పు అయిదు మూరలు ఉంది. దానిని కొలిచినప్పుడు పొడవు నలభై మూరలు వెడల్పు ఇరవై మూరలు#41:2 అంటే సుమారు 2.7 మీటర్లు; 9, 11, 12 వచనాల్లో కూడా ఉంది.
3అప్పుడతడు గర్భాలయం లోపలికి వెళ్లి వాకిలి ద్వారబంధాలను కొలిచినప్పుడు వాటి వెడల్పు రెండు మూరలు#41:3 అంటే సుమారు 1.1 మీటర్లు; 22 వచనంలో కూడా, వాకిలి ఆరు మూరలు దానికి రెండు వైపులా ఉన్న గోడల వెడల్పు ఏడు మూరలు ఉంది. 4అతడు గర్భాలయాన్ని కొలిచినప్పుడు దాని పొడవు ఇరవై మూరలు, ప్రధాన మందిరానికి దానికి మధ్య ఉన్న వెడల్పు ఇరవై మూరలు ఉంది. “అది అతి పరిశుద్ధ స్థలం” అని అతడు నాతో చెప్పాడు.
5తర్వాత అతడు ఆలయ గోడలను కొలిచినప్పుడు వాటి మందం ఆరు మూరలు, ఆలయానికి రెండు వైపులా ఉన్న గదుల వెడల్పు నాలుగేసి మూరల ఉంది. 6ప్రక్కన ఉన్న ఆ గదులకు మూడంతస్థులు ఉన్నాయి. ప్రతి అంతస్తులో ముప్పై గదులున్నాయి. అవి ఆలయ గోడకు ఆనుకుని ఉండకుండా ప్రక్క గదులకు ఆనుకుని ఉండేలా ఆలయ గోడ చుట్టూ వరసగా ఉన్నాయి. 7మందిరం చుట్టూ ఉన్న ఈ ప్రక్క గదులు పైకి వెళ్లే కొలది వాటి వెడల్పు ఎక్కువవుతుంది. మందిరం చుట్టూ ఉన్న గదులు క్రింది నుండి పైకి వెళ్లే కొలది ఎక్కువ వెడల్పుగా ఉండేలా అవి నిర్మించబడ్డాయి. క్రింది అంతస్తు నుండి మధ్య అంతస్తు ద్వారా పై అంతస్తు వరకు మెట్లు ఉన్నాయి.
8నేను చూసినప్పుడు మందిరం చుట్టూ మేడ గదులకు ఎత్తుగా ఉన్న పునాది కనిపించింది. దాని పొడవు కొలిచే కర్రంత అనగా ఆరు మూరలు. 9ఆ ప్రక్క గదుల బయటి గోడల మందం అయిదు మూరలు. ఆలయపు ప్రక్క గదుల మధ్యలో ఖాళీ స్థలం ఉంది. 10ఆలయానికి అన్ని వైపుల నుండి ఇరవై మూరల దూరంలో యాజకుల గదులు ఉన్నాయి. 11ఆ ప్రక్క గదుల గుమ్మాలు ఖాళీ స్థలం వైపుకు ఉన్నాయి. ఒక గుమ్మం ఉత్తరం వైపుకు మరొకటి దక్షిణం వైపుకు ఉంది. ఖాళీ స్థలం అన్ని వైపుల నుండి అయిదు మూరలు ఉంది.
12పడమటి వైపున ఆలయ ఆవరణానికి ఎదురుగా ఉన్న భవనం డెబ్బై మూరల వెడల్పుతో ఉంది. దాని గోడ మందం అయిదు మూరలు పొడవు తొంభై మూరలు.
13తర్వాత అతడు మందిరాన్ని కొలిచినప్పుడు అది వంద మూరల పొడవు ఉంది. ఆలయ ఆవరణాన్ని దానికి ఎదురుగా ఉన్న భవనాన్ని దాని గోడలను కొలిచినప్పుడు అది వంద మూరలు ఉంది. 14తూర్పు వైపు ఆలయ ప్రాంగణాన్ని ఆలయ ముందు భాగాన్ని కొలిచినప్పుడు అది వంద మూరలు ఉంది.
15మందిరం వెనుక భాగంలో ఉన్న ఆవరణానికి ఎదురుగా ఉన్న భవనాన్ని దానికి రెండు వైపులా ఉన్న వసారాలను అతడు కొలిచినప్పుడు వంద మూరలు ఉంది.
ప్రధాన ప్రాంగణం, గర్భాలయం, ఆవరణానికి ఎదురుగా ఉన్న మంటపం, 16గడపలు, కమ్ములు ఉన్న కిటికీలు మూడు అంతస్తుల చుట్టూ ఉన్న వసారాలను చెక్కతో కప్పి ఉన్న గడపలతో సహా ప్రతిదాన్ని అతడు కొలిచాడు. నేల, కిటికీల వరకు ఉన్న గోడ, కిటికీలు చెక్కతో కప్పబడి ఉన్నాయి. 17వాకిలికి పై భాగంలో గర్భాలయం బయట, లోపల ఉన్న గోడలు, మందిరం చుట్టూ ఉన్న బయటి గోడలు లోపలి గోడలు కొలత ప్రకారం కట్టి ఉన్నాయి. 18వాటిపై కెరూబులు ఖర్జూరపు చెట్లు చెక్కి ఉన్నాయి. రెండు కెరూబుల మధ్యలో ఒక ఖర్జూరపు చెట్టు ఉంది. ప్రతి కెరూబుకు రెండు ముఖాలు ఉన్నాయి. 19ఒక ప్రక్కన ఉన్న ఖర్జూరపు చెట్టు వైపు నరుని ముఖం, రెండవ ప్రక్కన ఉన్న ఖర్జూరపు చెట్టు వైపు సింహ ముఖం ఉన్నాయి. ఆలయమంతా అవి చెక్కి ఉన్నాయి. 20నేల నుండి వాకిలి పైభాగం వరకు ప్రధాన మందిరపు గోడలపై కెరూబులు ఖర్జూరపు చెట్లు చెక్కి ఉన్నాయి.
21ప్రధాన మందిరానికి ద్వారబంధం దీర్ఘచతురస్రాకారంలో ఉంది. అతి పరిశుద్ధ స్థలం ద్వారబంధం కూడా అలాంటిదే. 22అక్కడ చెక్కతో చేయబడి ఉన్న బలిపీఠం ఎత్తు మూడు మూరలు పొడవు రెండు మూరలు. దాని మూలలు అడుగుభాగం ప్రక్క భాగం కర్రతో చేయబడ్డాయి. “ఇది యెహోవా ఎదుట ఉండే బల్ల” అని అతడు నాతో చెప్పాడు. 23ప్రధాన మందిరానికి అతి పరిశుద్ధ స్థలానికి రెండు తలుపులు ఉన్నాయి. 24ప్రతి తలుపుకు మడత బందులు ఉన్న రెండు రెక్కలు ఉన్నాయి. 25గోడ మీద ఉన్నట్లే ప్రధాన ప్రాంగణం తలుపులపై కెరూబులు ఖర్జూరపు చెట్లు చెక్కి ఉన్నాయి. బయటి మంటపానికి కర్రతో చేసిన పందిరి ఉంది. 26ఆవరణ ప్రక్క గోడలలో ఇరుకైన కిటికీలు ఉన్నాయి, ప్రతి వైపున ఖర్జూర చెట్లతో చెక్కబడ్డాయి. ఆలయ ప్రక్క గదులకు కూడా కప్పులు ఉండేవి.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

యెహెజ్కేలు 41: OTSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి

యెహెజ్కేలు 41 కోసం వీడియో