ద్వితీయో 24

24
1ఒక వ్యక్తి ఒక స్త్రీని పెళ్ళి చేసుకున్న తర్వాత ఆమె అంతకుముందే వేరొకనితో సంబంధం కలిగి ఉన్నట్లు అనుమానం కలిగి ఆమె మీద ఇష్టం తొలగిపోతే, అతడు ఆమెకు విడాకుల ధృవీకరణ పత్రం వ్రాసి ఆమెకు ఇచ్చి తన ఇంట్లోనుండి పంపివేయాలి. 2ఒకవేళ ఆమె అతని ఇంటి నుండి వెళ్లిన తర్వాత ఆమె మరొక వ్యక్తికి భార్య అయితే, 3ఆమె రెండవ భర్త కూడా ఆమెను ఇష్టపడలేదు, ఆమెకు విడాకుల ధృవీకరణ పత్రం వ్రాసి ఆమెకు ఇచ్చి అతని ఇంటి నుండి పంపిస్తే లేదా అతడు చనిపోతే, 4అప్పుడు ఆమె విడాకులు తీసుకున్న ఆమె మొదటి భర్త, ఆమె అపవిత్రమైన తర్వాత ఆమెను మళ్ళీ పెళ్ళి చేసుకోవడానికి అనుమతించబడలేదు. అది యెహోవా దృష్టిలో అసహ్యకరమైనది. మీ దేవుడైన యెహోవా మీకు వారసత్వంగా ఇస్తున్న దేశం మీదికి మీరు దోషం తీసుకురావద్దు.
5ఒక వ్యక్తి క్రొత్తగా పెళ్ళి చేసుకున్నట్లయితే, అతన్ని యుద్ధానికి పంపకూడదు, ఏ ఇతర భారాన్ని మోపకూడదు. ఒక సంవత్సరం పాటు అతడు స్వేచ్ఛగా ఇంట్లో ఉండి పెళ్ళి చేసుకున్న భార్యను సంతోషపెట్టాలి.
6అప్పు కోసం పూచీకత్తుగా ఒక తిరగలిని గాని, తిరగలి పై రాతిని గాని తాకట్టు పెట్టకూడదు. ఎందుకంటే అది మనిషి జీవనాధారాన్ని తాకట్టు పెట్టినట్లవుతుంది.
7ఎవరైనా తోటి ఇశ్రాయేలును ఎత్తుకెళ్లి, బానిసగా చూస్తూ లేదా అమ్ముతూ పట్టుబడినా, ఎత్తుకెళ్లిన వాడు మరణించాలి. మీ మధ్య నుండి చెడును ప్రక్షాళన చేయాలి.
8అపవిత్రం చేసే కుష్ఠు#24:8 హెబ్రీ భాషలో ఏ చర్మ వ్యాధి గురించియైనా కుష్ఠువ్యాధి అని వాడబడింది లాంటి వ్యాధి విషయాల్లో, లేవీయ యాజకులు మీకు సూచించిన విధంగా ఖచ్చితంగా చేయండి. నేను వారికి ఆజ్ఞాపించిన వాటిని మీరు జాగ్రత్తగా పాటించాలి. 9మీరు ఈజిప్టు నుండి ప్రయాణమై వస్తూ ఉండగా మీ దేవుడైన యెహోవా మిర్యాముకు ఏమి చేశారో జ్ఞాపకం ఉంచుకోండి.
10మీరు మీ పొరుగువానికి ఏదైనా అప్పు ఇచ్చినప్పుడు, వారు తాకట్టుగా పెట్టిన దాన్ని తెచ్చుకోడానికి ఇంట్లో చొరబడకూడదు. 11బయటనే నిలవాలి, ఇంట్లోనుండి వచ్చి అతడే స్వయంగా ఆ వస్తువు తెచ్చి ఇవ్వాలి. 12పొరుగువాడు పేదవాడైతే, వాని తాకట్టును మీ దగ్గర పెట్టుకుని నిద్రపోవద్దు. 13సూర్యాస్తమయానికి వారి వస్త్రాన్ని తిరిగి ఇవ్వండి, తద్వారా మీ పొరుగువారు దానిపై నిద్రపోవచ్చు. అప్పుడు వారు మిమ్మల్ని దీవిస్తారు, అది మీ దేవుడైన యెహోవా దృష్టిలో నీతిగా లెక్కించబడుతుంది.
14మీ తోటి ఇశ్రాయేలీయులలో గాని మీ పట్టణాల్లో నివసిస్తున్న విదేశీయులలో గాని పేదవారై అవసరంలో ఉన్న కూలివారిని బాధించవద్దు. 15ప్రతిరోజు సూర్యాస్తమయానికి ముందు వారి వేతనాలు చెల్లించండి, ఎందుకంటే వారు పేదవారు దానిని లెక్కిస్తున్నారు. లేకపోతే వారు మీకు వ్యతిరేకంగా యెహోవాకు మొర పెట్టవచ్చు, అప్పుడు మీరు దోషులుగా పరిగణించబడతారు.
16తల్లిదండ్రులు తమ పిల్లల కోసం మరణశిక్ష పొందకూడదు, లేదా వారి తల్లిదండ్రుల కోసం పిల్లలు మరణశిక్ష పొందకూడదు; ప్రతి ఒక్కరూ తమ సొంత పాపం కోసం చనిపోతారు.
17న్యాయం విషయంలో విదేశీయులను గాని తండ్రిలేనివారిని గాని వంచించకండి లేదా విధవరాలి యొక్క వస్త్రాన్ని తాకట్టుగా తీసుకోకండి, 18మీరు ఈజిప్టులో బానిసలుగా ఉన్నారని, మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని అక్కడినుండి విడిపించారని జ్ఞాపకముంచుకోండి. అందుకే ఇలా చేయండని నేను మీకు ఆజ్ఞాపిస్తున్నాను.
19మీరు మీ పొలంలో పంట కోసినప్పుడు, మీరు ఒక పనను పట్టించుకోకపోతే, దాన్ని తెచ్చుకోడానికి తిరిగి వెనుకకు వెళ్లవద్దు. మీ చేతుల యొక్క అన్ని పనులలో మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించేలా విదేశీయులు, తండ్రిలేనివారు, విధవరాండ్ర కోసం వదిలేయండి. 20మీరు మీ చెట్ల నుండి ఒలీవలను కొట్టినప్పుడు, రెండవసారి కొమ్మలపైకి వెళ్లవద్దు. విదేశీయులు, తండ్రిలేనివారు, విధవరాండ్ర కోసం మిగిలి ఉన్నవాటిని వదిలేయండి. 21మీరు మీ ద్రాక్షతోటలో ద్రాక్షను కోసినప్పుడు, మళ్ళీ తీగెల మీద వెదకవద్దు. మిగిలి ఉన్నవాటిని విదేశీయులు, తండ్రిలేనివారు, విధవరాండ్ర కోసం వదిలేయండి. 22మీరు ఈజిప్టులో బానిసలుగా ఉంటిరని జ్ఞాపకముంచుకోండి. అందుకే ఇలా చేయండని నేను మీకు ఆజ్ఞాపిస్తున్నాను.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

ద్వితీయో 24: OTSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి

ద్వితీయో 24 కోసం వీడియో