1 దినవృత్తాంతములు 5
5
రూబేను
1ఇశ్రాయేలు మొదటి కుమారుడైన రూబేను కుమారులు. (అతడు మొదటి కుమారుడు, కాని అతడు తన తండ్రి పడక ఎక్కి దాన్ని అపవిత్రం చేశాడు కాబట్టి, అతని జ్యేష్ఠత్వపు హక్కులు ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు కుమారులకు ఇవ్వబడ్డాయి; కాబట్టి జన్మహక్కుల ప్రకారం వంశావళిలో అతడు నమోదు కాలేదు. 2యూదా తన అన్నదమ్ములకంటే బలవంతుడు, అతని వంశంలో నుండి పరిపాలకుడు వచ్చాడు, అయినా కూడా జ్యేష్ఠత్వపు హక్కులు యోసేపుకు వచ్చాయి.) 3ఇశ్రాయేలు మొదటి కుమారుడైన రూబేను కుమారులు వీరు:
హనోకు, పల్లు, హెస్రోను, కర్మీ.
4యోవేలు సంతానం:
అతని కుమారుడు షెమయా, అతని కుమారుడు గోగు,
అతని కుమారుడు షిమీ, 5అతని కుమారుడు మీకా,
అతని కుమారుడు రెవాయా, అతని కుమారుడు బయలు,
6అతని కుమారుడు బెయేర, ఇతన్ని అష్షూరు రాజైన తిగ్లత్-పిలేసెరు#5:6 లేదా తిగ్లత్-పిలేసెరు బందీగా తీసుకెళ్లాడు. బెయేర రూబేనీయులకు నాయకుడు.
7వారి వంశావళిలో పేర్కొన్న కుటుంబాల ప్రకారం వారి బంధువులు:
నాయకుడైన యెహీయేలు, జెకర్యా, 8యోవేలు కుమారుడైన షెమ కుమారుడైన ఆజాజు కుమారుడైన బేల.
వారు అరోయేరు నుండి నెబో వరకు, బయల్-మెయోను వరకు నివసించారు. 9వారి పశువులు గిలాదులో విస్తారంగా వృద్ధిచెందడంతో, తూర్పున యూఫ్రటీసు నది దగ్గర నుండి ఎడారి సరిహద్దు వరకు వారు నివసించారు.
10సౌలు పాలిస్తున్నప్పుడు వారు హగ్రీయీలతో యుద్ధం చేసి వారిని ఓడించారు. వారు గిలాదుకు తూర్పుగా ఉన్న ప్రాంతమంతటిలో ఉన్న హగ్రీయీల నివాస స్థలాలను స్వాధీనం చేసుకున్నారు.
గాదు
11గాదీయులు వారికి ఎదురుగా బాషానులో సలేకా వరకు నివసించారు.
12వారికి యోవేలు నాయకుడు. అతని తర్వాత షాపాము, తర్వాత యహనై, షాపాతు, వీరు బాషానులో ఉండేవారు.
13వారి కుటుంబాల ప్రకారం వారి బంధువులు:
మిఖాయేలు, మెషుల్లాము, షేబ, యోరై, యకాను, జీయ, ఏబెరు మొత్తం ఏడుగురు.
14వీరు హూరీ కుమారుడైన అబీహయిలు కుమారులు: హూరీ యరోయ కుమారుడు, యరోయ గిలాదు కుమారుడు, గిలాదు మిఖాయేలు కుమారుడు, మిఖాయేలు యెషీషై కుమారుడు, యెషీషై యహదో కుమారుడు, యహదో బూజు కుమారుడు.
15గూనీ కుమారుడైన అబ్దీయేలుకు పుట్టిన అహీ వారి కుటుంబ పెద్ద.
16గాదు వంశస్థులు బాషానులో గిలాదులో, చుట్టుప్రక్కల గ్రామాల్లో, షారోను సరిహద్దుల వరకు ఉన్న పచ్చని మైదానాల్లో నివసించారు.
17వీరందరు యూదా రాజైన యోతాము రోజుల్లో ఇశ్రాయేలు రాజైన యరొబాము రోజుల్లో వంశావళి పత్రాలలో నమోదయ్యారు.
18రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్థగోత్రం వారిలో డాలు కత్తి పట్టుకోవడంలో నేర్పుగలవారు, విల్లు ఉపయోగించగలవారు, యుద్ధశిక్షణ తీసుకున్నవారు 44,760 మంది ఉన్నారు. 19వారు హగ్రీయీలతో, యెతూరువారితో, నాపీషువారితో, నోదాబువారితో యుద్ధం చేశారు. 20వారు యుద్ధ సమయంలో దేవునికి మొరపెట్టారు కాబట్టి దేవుడు వారికి సహాయం చేసి ఆ హగ్రీయీలను, వారితో ఉన్నవారందరిని వారి చేతికి అప్పగించారు. వారు ఆయన మీద నమ్మకముంచారు కాబట్టి ఆయన వారి ప్రార్థన అంగీకరించారు. 21వారు హగ్రీయీలకు చెందిన యాభైవేల ఒంటెలు, రెండు లక్షల యాభైవేల గొర్రెలు, రెండువేల గాడిదలను పట్టుకున్నారు. అలాగే లక్ష మంది మనుష్యులను బందీలుగా తీసుకెళ్లారు. 22ఇంకా చాలామంది శత్రువులను చంపారు ఎందుకంటే ఆ యుద్ధం దేవునిది. చెరకు వెళ్లేవరకు వారు అక్కడే నివసించారు.
మనష్షే అర్థగోత్రం
23మనష్షే అర్థగోత్రీకులు చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు; వారు బాషాను నుండి, బయల్-హెర్మోను వరకు, అంటే శెనీరు వరకు (హెర్మోను పర్వతం) నివసించారు.
24వారి కుటుంబ పెద్దలు వీరే: ఏఫెరు, ఇషీ, ఎలీయేలు, అజ్రీయేలు, యిర్మీయా, హోదవ్యా, యహదీయేలు. వీరు ధైర్యవంతులైన వీరులు, ప్రసిద్ధి చెందినవారు వారి కుటుంబ పెద్దలు. 25అయితే వారు తమ పూర్వికుల దేవుని పట్ల నమ్మకద్రోహులుగా ఉన్నారు, దేవుడు తమ ఎదుట నాశనం చేసిన దేశ ప్రజల దేవుళ్ళను పూజిస్తూ, వాటితో వ్యభిచారులగా ప్రవర్తించారు. 26కాబట్టి ఇశ్రాయేలీయుల దేవుడు అష్షూరు రాజైన పూలు మనస్సును (అష్షూరు రాజైన తిగ్లత్-పిలేసెరు) పురికొల్పగా, అతడు రూబేనీయులను, గాదీయులను, మనష్షే అర్థగోత్రీకులను బందీలుగా తీసుకెళ్లాడు. అతడు వారిని హాలహు, హాబోరు, హారా, గోజాను అనే నదీ ప్రాంతాలకు తీసుకెళ్లాడు. ఈ రోజు వరకు వారు అక్కడే ఉన్నారు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
1 దినవృత్తాంతములు 5: OTSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.