రోమా 7:17-25

రోమా 7:17-25 TCV

ఇదంతా చేస్తున్నది నేను కాదు నాలో నివసిస్తున్న పాపమే. నాకున్న పాప స్వభావాన్ని బట్టి మంచిది ఏదీ నాలో నివసించదని నాకు తెలుసు కనుక, నేను మంచిని జరిగించాలనే కోరిక నాకు ఉన్నప్పటికీ దానిని నేను నెరవేర్చలేకపోతున్నాను. నేను చేయాలనుకున్న మంచిని చేయడం లేదు కాని, నేను దేనినైతే చేయకూడదు అని అనుకుంటున్నానో ఆ చెడునే చేస్తున్నాను. అయితే ఇప్పుడు నేను చేయకూడదని అనుకుంటున్న దానిని నేను చేస్తే, అలా చేస్తున్నది నేను కాదు నాలో నివసిస్తున్న పాపమే. కనుక ఈ నియమాన్ని నేను గమనించాను, నేను మంచిని చేయాలని అనుకుంటున్నప్పటికి నాలో చెడు ఉన్నది. నా అంతరంగంలో దేవుని ధర్మశాస్త్రాన్ని బట్టి నేను ఆనందిస్తున్నాను, కాని మరొక నియమం నాలో ఉన్నట్లు నాకు కనబడుతుంది, అది నా మనస్సులోని నియమంతో పోరాడుతున్నది, నాలో పని చేస్తున్న పాపనియమానికి అది నన్ను బంధీగా చేస్తుంది. నేను ఎంత దౌర్భాగ్యుడిని! మరణానికి బంధీగా ఉన్న నా శరీరం నుండి నన్ను ఎవరు రక్షించగలరు? మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా నాకు విడుదలను ఇచ్చే దేవునికి వందనాలు! అయితే నా మనస్సులో నేను దేవుని ధర్మశాస్త్రానికి దాసుడను, కాని నాకున్న పాప స్వభావంలో నేను పాపనియమానికి దాసుడను.

రోమా 7:17-25 కోసం వీడియో