నాకు అనుగ్రహించబడిన కృపను బట్టి మీలో ప్రతి ఒక్కరికీ నేను చెప్పేదేమిటంటే, మీరు ఉండవలసిన దానికన్నా మిమ్మల్ని మీరు ఎక్కువగా భావించవద్దు కాని, దేవుడు మీలో ప్రతి ఒక్కరికి పంచియిచ్చిన విశ్వాసం ప్రకారం మీ గురించి మీరు వివేకం కలిగి అంచనా వేసుకోండి. ఎలాగైతే మనలో ప్రతి ఒకరు వేరు వేరు పనులు చేసే అనేక అవయవాలతో ఒకే శరీరం కలిగి ఉన్నామో, అలాగే మనం అనేకులమైనప్పటికీ క్రీస్తులో ఒక్క శరీరంగా ఉన్నాము, ప్రతి ఒక్కరు మిగిలిన వారందరికి సంబంధించినవారే. మనలో ప్రతి ఒక్కరికి అనుగ్రహింపబడిన కృపను బట్టి మనం వేరు వేరు కృపావరాలు కలిగివున్నాము. నీ కృపావరం ప్రవచనా వరమైతే నీ విశ్వాసానికి అనుగుణంగా ప్రవచించు. ఆ కృపావరం సేవచేయడమైతే సేవ చేయి. ఆ కృపావరం బోధించడమైతే బోధించు.
Read రోమా 12
వినండి రోమా 12
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: రోమా 12:3-7
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు