కీర్తనలు 58

58
కీర్తన 58
సంగీత దర్శకునికి. “నిర్మూలం చేయకు” అనే రాగం మీద పాడదగినది. దావీదు శ్రేష్ఠమైన కీర్తన.
1పాలకులారా, నిజంగా మీరు న్యాయంగా మాట్లాడతారా?
మీరు మనుష్యులకు న్యాయంగా తీర్పు తీరుస్తారా?
2లేదు, మీ హృదయంలో అన్యాయం చేస్తున్నారు,
దేశంలో హింసను పెంచుతున్నారు.
3ఈ దుష్టులు పుట్టుకతోనే దారి తప్పినవారు;
గర్భం నుండే వారు అబద్ధాలాడుతారు.
4వారి విషం భయంకరమైన పాముల విషం లాంటిది
చెవులు మూసుకున్న నాగుపాములా వారున్నారు
5పాములు ఆడించేవారు ఎంత నైపుణ్యంగా వాయించినా
ఆ సంగీతాన్ని వినని పాముల్లా వారున్నారు.
6దేవా! వారి నోటి పళ్ళు విరగ్గొట్టండి;
యెహోవా! ఈ కొదమ సింహాల కోరలను ఊడదీయండి.
7ప్రవహించే నీటిలా వారు మాయమవుదురు గాక;
వారు విల్లు ఎక్కుపెట్టినప్పుడు వారి బాణాలు గురిని చేరకుండును గాక.
8వారు నడుస్తూ కరిగి నశించిపోయే నత్తల్లా వారుంటారు.
గర్భస్రావమై వెలుగు చూడని పిండంలా వారవుతారు.
9మీ కుండలకు ముండ్లకంపల సెగ తగలకముందే,
పచ్చివైనా ఎండినవైనా అంటే చిన్నా పెద్దా తేడా లేకుండ దుష్టులు తుడిచివేయబడతారు.
10ప్రతీకారం జరిగినప్పుడు నీతిమంతులు సంతోషిస్తారు,
దుష్టుల రక్తంలో వారు కాళ్లు కడుక్కుంటారు.
11తర్వాత ప్రజలు అది చూసి,
“నీతిమంతులకు తప్పక బహుమానం ఉంటుంది;
ఖచ్చితంగా ఈ లోకంలో తీర్పు తీర్చే దేవుడు ఉన్నారు” అంటారు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

కీర్తనలు 58: TSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి