కీర్తనలు 52
52
కీర్తన 52
సంగీత దర్శకునికి. దావీదు ధ్యానకీర్తన. ఎదోమీయుడైన దోయేగు సౌలు దగ్గరకు వచ్చి–దావీదు అహీమెలెకు ఇంటికి వెళ్లాడని అతనితో చెప్పినప్పుడు దావీదు ఈ కీర్తన రచించాడు.
1బలాఢ్యుడా, చేసిన కీడు గురించి ఎందుకు గొప్పలు చెప్పుకుంటున్నావు?
దేవుని దృష్టిలో అవమానకరమైన నీవు,
రోజంతా ఎందుకు ప్రగల్భాలు పలుకుతావు?
2మోసం చేసేవాడా,
నీ నాలుక పదునైన క్షౌరం చేసే కత్తి;
అది నాశనాన్ని చేస్తుంది.
3మేలు కంటే కీడు చేయడం,
నీతి కంటే అబద్ధం చెప్పడమే నీకు ఇష్టం. సెలా
4మోసపూరితమైన నాలుక గలవాడా,
నీకు హానికరమైన మాటలే ఇష్టం.
5ఖచ్చితంగా దేవుడు నిన్ను నిత్యనాశనానికి గురి చేస్తారు:
ఆయన నిన్ను మీ గుడారంలో నుండి పెరికివేస్తారు;
సజీవుల దేశంలో నుండి నిన్ను పెరికివేస్తారు. సెలా
6నీతిమంతులు ఇదంతా చూసి భయభక్తులతో
వారు నవ్వుతూ ఇలా అంటారు,
7“ఇతన్ని చూడండి,
దేవున్ని తన బలమైన కోటగా చేసుకోకుండ
తనకున్న సంపదలను నమ్ముకుని
ఇతరులను నాశనం చేస్తూ బలపడ్డాడు!”
8కానీ నేను దేవుని నివాసంలో
పచ్చని ఒలీవ చెట్టులా ఉన్నాను;
నేను ఎల్లప్పుడు,
మారని దేవుని ప్రేమను నమ్ముతాను.
9మీరు చేసిందానికి నేను ఎల్లప్పుడు
మీ భక్తుల ఎదుట మిమ్మల్ని స్తుతిస్తాను.
మీ నామం ఉత్తమమైనది,
కాబట్టి నేను మీ నామంలో నిరీక్షణ కలిగి ఉన్నాను.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
కీర్తనలు 52: TSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
![None](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapi.com%2F58%2Fhttps%3A%2F%2Fweb-assets.youversion.com%2Fapp-icons%2Fte.png&w=128&q=75)
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.