కీర్తనలు 113

113
కీర్తన 113
1యెహోవాను స్తుతించండి.#113:1 హెబ్రీలో హల్లెలూయా
యెహోవా సేవకులారా ఆయనను స్తుతించండి;
యెహోవా నామాన్ని స్తుతించండి.
2ఇప్పుడు ఎల్లప్పుడు సదా
యెహోవా నామం స్తుతింపబడును గాక.
3సూర్యోదయం నుండి అస్తమించే చోటు వరకు,
యెహోవా నామం స్తుతింపబడును గాక.
4దేశాలన్నిటికి పైగా యెహోవా హెచ్చింపబడ్డారు,
ఆయన మహిమ ఆకాశాలకు పైగా విస్తరించి ఉంది.
5మన దేవుడైన యెహోవా లాంటి వారెవరు,
ఎత్తైన సింహాసనంపై ఆసీనులై ఉన్నవారు,
6అక్కడినుండి ఆకాశాన్ని,
భూమిని వంగి చూడగలవారెవరు?
7దరిద్రులను మట్టిలో నుండి పైకెత్తేది
పేదవారిని బూడిద కుప్ప నుండి లేవనెత్తేది ఆయనే;
8ఆయన వారిని రాకుమారులతో,
తన ప్రజల రాకుమారులతో కూర్చోబెడతారు.
9అతడు సంతానం లేని స్త్రీని
తన ఇంట్లో సంతోషంగా ఉన్న తల్లిగా స్థిరపరుస్తారు.
యెహోవాను స్తుతించండి.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

కీర్తనలు 113: TSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి