సామెతలు 9
9
జ్ఞానం, బుద్ధిహీనత
1జ్ఞానము తన ఇంటిని నిర్మించుకొని;
దానికి ఏడు స్తంభాలు చెక్కుకొనినది.
2ఆమె మాంసాహారం తయారుచేసి తన ద్రాక్షరసాన్ని కలిపింది;
తన భోజనబల్లను సిద్ధము చేసి ఉన్నది.
3ఆమె తన దాసులను బయటకు పంపి,
పట్టణంలోని ఎత్తైన స్థలము మీద నిలువబడి,
4“సామాన్యమైన వారలారా, ఇక్కడకు రండి!” అని పిలుస్తుంది!
బుద్ధిలేనివారితో అది ఇలా అంటుంది:
5“రండి, నేను సిద్ధం చేసిన ఆహారం తినండి.
నేను కలిపిన ద్రాక్షరసం త్రాగండి.
6ఇకపై తెలివి లేనివారిగా ఉండకుండా బ్రతుకండి;
తెలివిని కలిగించు దారిలో చక్కగా నడపండి.”
7వెక్కిరించు వానికి బుద్ధి చెప్పు వాడు తనకు అవమానాన్ని తెచ్చుకుంటాడు;
దుష్టులు వానిని గద్దించు వారు నిందను తెచ్చుకుంటారు.
8హేళనగా మాట్లాడు వానిని గద్దించకు లేకపోతే వాడు నిన్ను ద్వేషిస్తాడు;
తెలివిగల వానిని గద్దిస్తే వాడు నిన్ను ప్రేమిస్తాడు.
9జ్ఞానం గలవానికి బోధించగా వాడు మరింత జ్ఞానంగలవానిగా ఉంటారు;
మంచివానికి బోధ చేయగా వాడు జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుంటాడు.
10యెహోవాయందు భయం జ్ఞానానికి మూలం,
పవిత్రమైన దేవుని గురించిన తెలివియే మంచి చెడులను గురించి తెలుసుకొనుటకు ఆధారం.
11జ్ఞానం వలన నీకు దీర్ఘాయువు కలుగుతుంది,
నీవు జీవించే ఎక్కువవుతాయి.
12నీవు తెలివి కలిగిన వానివైతే నీ తెలివి వలన నీకే లాభము;
జ్ఞానమును ఎగతాళి చేసిన ఎడల దానిని నీవే భరించవలెను.
13బుద్ధిహీనత అనే స్త్రీ గగ్గోలు పెట్టేది;
ఆమె తెలివితక్కువది దానికి ఏమీ తెలియదు.
14ఆ స్త్రీ తన ఇంటి వాకిటిలో కూర్చుండును,
ఊరి ప్రధాన వీధుల్లో కుర్చీమీద అది కూర్చుండును,
15ఆ దారిలో వెళ్లు వారిని చూసి,
తమ మార్గములో చక్కగా వెళ్లు వారిని చూసి,
16“సామాన్యమైన వారలారా, ఇక్కడకు రండి!” అని పిలుస్తుంది!
బుద్ధిలేనివారితో అది ఇలా అంటుంది:
17“దొంగతనం చేసిన నీళ్లు తీపి,
రహస్యంగా చేసిన భోజనం రుచి!”
18అయితే అక్కడ మృతులు ఉన్నారని,
దాని అతిథులు పాతాళంలో ఉన్నారని వారికి కొంతవరకే తెలుసు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
సామెతలు 9: TSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
![None](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapi.com%2F58%2Fhttps%3A%2F%2Fweb-assets.youversion.com%2Fapp-icons%2Fte.png&w=128&q=75)
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.