యోహాను 10:11-15

యోహాను 10:11-15 TCV

“నేను మంచి కాపరిని. మంచి కాపరి తన గొర్రెలను కాపాడడానికి తన ప్రాణానికి తెగిస్తాడు. జీతగాడు గొర్రెల కాపరి కాదు, ఆ గొర్రెలు తనవి కావు. కనుక తోడేలు రావడం చూసి వాడు గొర్రెలను విడిచి పారిపోతాడు. తోడేలు ఆ మంద మీద దాడి చేసి వాటిని చెదరగొడుతుంది. వాడు జీతగాడు జీతం కొరకే పని చేస్తాడు కనుక గొర్రెల గురించి పట్టించుకోకుండా పారిపోతాడు. “నేను మంచి కాపరిని; నా తండ్రికి నేను తెలుసు నాకు నా తండ్రి తెలుసు; అలాగే నాకు నా గొర్రెలు తెలుసు నా గొర్రెలకు నేను తెలుసు. నా గొర్రెల కొరకు నేను నా ప్రాణం పెడతాను.