యిర్మీయా 1:5-9

యిర్మీయా 1:5-9 TSA

“గర్భంలో నేను నిన్ను రూపించక ముందే నీవు నాకు తెలుసు, నీవు పుట్టకముందే నేను నిన్ను ప్రత్యేకపరచుకున్నాను; దేశాలకు నిన్ను ప్రవక్తగా నియమించాను” అని చెప్పింది. అప్పుడు నేను, “అయ్యో, ప్రభువైన యెహోవా, నేను చిన్నవాన్ని, ఎలా మాట్లాడాలో నాకు తెలియదు” అన్నాను. అయితే యెహోవా నాతో, “ ‘నేను చిన్నవాన్ని’ అని నీవు అనవద్దు. నేను నిన్ను ఎవరి దగ్గిరికి పంపితే నీవు వారి దగ్గరికి వెళ్లి నేను ఏది ఆజ్ఞాపించానో అది వారికి చెప్పాలి. నీవు వారికి భయపడవద్దు, నేను నీతో ఉండి నిన్ను విడిపిస్తాను అని యెహోవా చెప్తున్నారు.” తర్వాత యెహోవా తన చేయి చాపి, నా నోటిని ముట్టి, “నీ నోటిలో నా మాటలు పెట్టాను.