న్యాయాధిపతులు 21

21
బెన్యామీనీయులకు భార్యలు
1ఇశ్రాయేలీయులు మిస్పాలో, “మనలో ఎవ్వరూ బెన్యామీనీయులకు తమ కుమార్తెలను పెళ్ళికి ఇవ్వకూడదు” అని ప్రమాణం చేసుకున్నారు.
2ప్రజలు బేతేలుకు#21:2 లేదా దేవుని మందిరం వెళ్లి అక్కడ సాయంత్రం వరకు దేవుని సన్నిధిలో కూర్చుని ఎంతగానో ఏడ్చారు. 3“యెహోవా! ఇశ్రాయేలు దేవా! ఇశ్రాయేలుకు ఇలా ఎందుకు జరిగింది? ఈ రోజు ఇశ్రాయేలు గోత్రాల్లో ఎందుకని ఒక గోత్రం అంతరించిపోవలసి వచ్చింది?” అంటూ ఏడ్చారు.
4మరుసటిరోజు ప్రొద్దున్నే వారు ఒక బలిపఠం కట్టి దాని మీద దహనబలులు, సమాధానబలులు అర్పించారు.
5అప్పుడు ఇశ్రాయేలీయులు, “ఇశ్రాయేలు గోత్రాలన్నిటిలో ఎవరైనా మిస్పాలో యెహోవా ఎదుట సమావేశం కాని వారున్నారా?” అని అడిగారు. ఎందుకంటే ఎవరైనా మిస్పాలో యెహోవా ఎదుట సమావేశం కాకపోతే వారికి మరణశిక్ష విధించాలని శపథం చేశారు.
6అప్పుడు వారు తమ తోటి ఇశ్రాయేలీయులైన బెన్యామీను గోత్రం గురించి బాధపడుతూ, “ఇశ్రాయేలులో ఈ రోజు ఒక గోత్రం అంతరించి పోయింది. 7వారికి మన కుమార్తెలను ఇవ్వవద్దని మనం యెహోవా పేరట శపథం చేశాం, మరి మిగిలిన వారికి భార్యలను ఎక్కడ చూడగలం?” అనుకున్నారు. 8తర్వాత వారు, “ఇశ్రాయేలు గోత్రాలన్నిటిలో నుండి మిస్పాలో యెహోవా ఎదుట సమావేశం కాని గోత్రమేది?” అని అడిగారు. చివరకు యాబేషు గిలాదు నుండి ఎవ్వరూ సమావేశానికి రాలేదని తెలుసుకున్నారు. 9ప్రజలందరినీ లెక్కపెట్టినప్పుడు, యాబేషు గిలాదు నుండి ఏ ఒక్కరూ అక్కడ కనిపించలేదు.
10అప్పుడు సమాజం పన్నెండువేలమంది యుద్ధవీరులను యాబేషు గిలాదుకు పంపతూ, అక్కడికి వెళ్లి అక్కడి వారినందరిని, స్త్రీలు పిల్లలతో సహితం ఖడ్గంతో చంపాలని ఆదేశించారు. 11వారు, “మీరు ఏం చేయాలంటే, ప్రతి పురుషుని, కన్య కాని ప్రతి స్త్రీని నాశనం చేయండి” అని వారు అన్నారు. 12వారు అక్కడ యాబేషు గిలాదు ప్రజల్లో పురుషులతో పడుకోని నాలుగువందలమంది యువతులను కనుగొన్నారు, వారిని కనానులోని షిలోహు దగ్గర ఉన్న శిబిరానికి తీసుకెళ్లారు.
13అప్పుడు సమాజమంతా రిమ్మోను బండ దగ్గర ఉన్న బెన్యామీనీయులతో సమాధానపడదాం అని కబురు పంపారు. 14ఆ సమయంలో బెన్యామీనీయులు తిరిగి వచ్చారు, యాబేషు గిలాదు స్త్రీలలో బ్రతకనిచ్చినవారిని వారికిచ్చి పెళ్ళిళ్ళు చేశారు. అయితే వారందరికీ ఆ స్త్రీలు సరిపోలేదు.
15యెహోవా ఇశ్రాయేలు గోత్రాల్లో లోపం కలుగజేశారని ప్రజలు బెన్యామీను విషయం బాధపడ్డారు. 16అప్పుడు సమాజపెద్దలు, “బెన్యామీను గోత్రంలో స్త్రీలు లేకుండా నాశనమై పోయినందుకు, వారిలో మిగిలిన వారిని భార్యలను ఎలా తేగలం? 17ఇశ్రాయేలు గోత్రాల్లో ఒక గోత్రం తుడిచిపెట్టుకుపోకుండ బెన్యామీను గోత్రంలో మిగిలిన వారికి వారసులుండాలి. 18వారికి మన కుమార్తెలను భార్యలుగా ఇవ్వలేం, ఎందుకంటే ఇశ్రాయేలీయులమైన మనం, ‘ఎవరైనా బెన్యామీనీయునికి తమ కుమార్తెను భార్యగా ఇస్తే వారు శాపగ్రస్తులు’ అని ప్రమాణం చేశాము. 19అయితే చూడండి, షిలోహులో యెహోవాకు సంవత్సర పండుగ జరుగుతుంది; షిలోహు బేతేలుకు ఉత్తరాన, బేతేలు నుండి షెకెముకు వెళ్లే దారికి తూర్పున, లెబోనాకు దక్షిణాన ఉన్న షిలోహులో యెహోవాకు సంవత్సర పండుగ జరుగుతుంది” అని అన్నారు.
20అప్పుడు వారు బెన్యామీనీయులను ఇలా ఆదేశించారు: “అక్కడికి వెళ్లి ద్రాక్షతోటల్లో దాక్కుని 21వేచి ఉండండి. షిలోహు నుండి యువతులు నాట్యంలో పాల్గొనడానికి వస్తున్నప్పుడు, మీరు ద్రాక్షతోటల్లో నుండి త్వరగా వచ్చి, ప్రతివాడును షిలోహు యువతులలో ఒక యువతిని పెళ్ళి చేసుకోడానికి తీసుకెళ్లండి. తర్వాత బెన్యామీను ప్రదేశానికి తిరిగి వెళ్లండి. 22వారి తండ్రులు గాని సోదరులు గాని మా దగ్గరకు వచ్చి ఫిర్యాదు చేస్తే, మేము వారితో, ‘యుద్ధ సమయంలో వారికి మేము భార్యలను తీసుకురాలేదు, కాబట్టి మీరు మా పట్ల దయచూపి వారికి సహాయం చెయ్యండి. మీ అంతట మీరు మీ కుమార్తెలను వారికివ్వలేదు, కాబట్టి మీరు ప్రమాణం విషయంలో అపరాధులు కారు’ అని చెప్తాము.”
23కాబట్టి బెన్యామీనీయులు అలాగే చేశారు. యువతులు నాట్యం చేస్తూ ఉంటే, ఒక్కొక్కడు ఒక్కొక్క యువతిని పట్టుకుని తనకు భార్యగా చేసుకున్నాడు. తర్వాత వారు తమ వారసత్వ భూమికి తిరిగివెళ్లి పట్టణాలను మళ్ళీ కట్టి వాటిలో స్థిరపడ్డారు.
24ఆ తర్వాత ఇశ్రాయేలీయులలో ప్రతి ఒక్కరు అక్కడినుండి తమ తమ గోత్రాలకు, వంశాలకు, తమ వారసత్వ భూమికి వెళ్లిపోయారు.
25ఆ రోజుల్లో ఇశ్రాయేలుకు రాజు లేడు; ప్రతి ఒక్కరూ తమకు సరియైనదని అనిపించింది చేసేవారు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

న్యాయాధిపతులు 21: TSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి