నా ప్రియ సహోదరీ సహోదరులారా, మీరు దీనిని గ్రహించాలి: ప్రతి ఒక్కరు వినడానికి చురుకుగా ఉండాలి, మాట్లాడడానికి నిదానంగా ఉండాలి, కోపగించుకోవడానికి నిదానంగా ఉండాలి; ఎందుకంటే మీ కోపం దేవుని నీతిని జరిగించదు. కనుక మీలో వున్న సమస్త నీచత్వాన్ని, అధికంగా పెరుగుతున్న దుష్టత్వాన్ని విడిచి మిమ్మల్ని రక్షించగల, శక్తి కలిగిన మీలో నాటబడిన వాక్యాన్ని దీనత్వంతో అంగీకరించండి. మీరు వాక్యాన్ని వినేవారిగా మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. వాక్యం చెప్పేది చేయండి. ఎవరైతే వాక్యాన్ని విని అది చెప్పిన ప్రకారం చేయరో, వారు తమ ముఖాన్ని అద్దంలో చూసుకొనే వారిలా ఉంటారు; వారు తమను చూసుకొని ప్రక్కకు వెళ్లిన వెంటనే తాము ఎలా ఉన్నారో మరిచిపోతారు. అయితే స్వాతంత్ర్యాన్ని ఇచ్చే సంపూర్ణమైన ధర్మశాస్త్రంలోనికి ఏకాగ్రతతో చూసి దానిలో కొనసాగేవారు, విని మర్చిపోయేవారిగా ఉండకుండా అది చెప్పిన ప్రకారం చేస్తారు; వారు తాము చేసిన దానిలో దీవించబడతారు. తమ నాలుకను అదుపుచేసుకోకుండా తమ హృదయాలను మోసం చేసుకుంటూ ఎవరైనా తాము భక్తిపరులమని భావిస్తే వారి భక్తి విలువలేనిది అవుతుంది.
Read యాకోబు 1
వినండి యాకోబు 1
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: యాకోబు 1:19-26
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు