హోషేయ 6
6
పశ్చాత్తాపపడని ఇశ్రాయేలు
1“రండి, మనం యెహోవా దగ్గరకు తిరిగి వెళ్దాము.
ఆయన మనల్ని ముక్కలుగా చీల్చారు
కాని ఆయనే మనల్ని బాగుచేస్తారు;
ఆయన మనల్ని గాయపరచారు
కాని ఆయన మన గాయాలను కడతారు.
2రెండు రోజుల తర్వాత ఆయన మనల్ని బ్రతికిస్తారు,
ఆయన సన్నిధిలో మనం బ్రతికేటట్టు,
మూడవ రోజున ఆయన మనల్ని పునరుద్ధరిస్తారు.
3మనం యెహోవా గురించి తెలుసుకుందాం;
ఆయనను తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము.
సూర్యోదయం ఎంత నిశ్చయమో,
ఆయన ప్రత్యక్షమవ్వడం అంతే నిశ్చయం;
ఆయన శీతాకాలం వర్షాల్లా,
భూమిని తడిపే తొలకరి వానలా దగ్గరకు వస్తారు.”
4“ఎఫ్రాయిమూ, నిన్ను నేనేం చేయాలి?
యూదా, నిన్ను నేనేం చేయాలి?
మీ ప్రేమ ప్రొద్దున వచ్చే పొగమంచులా,
ఉదయకాలపు మంచులా అదృశ్యమవుతుంది.
5కాబట్టి నా ప్రవక్తల ద్వారా మిమ్మల్ని ముక్కలు చేశాను,
నా నోటిమాటల ద్వారా మిమ్మల్ని చంపాను,
అప్పుడు నా తీర్పులు మెరుపులా ప్రకాశిస్తాయి.
6ఎందుకంటే నేను దయను కోరుతున్నాను బలిని కాదు,
దహనబలుల కంటే దేవుని గురించిన జ్ఞానం నాకు ఇష్టము.
7ఆదాములా#6:7 లేదా మానవుల్లా వారు నా నిబంధనను మీరారు;
వారు నాకు నమ్మకద్రోహం చేశారు.
8గిలాదు దుర్మార్గుల పట్టణం,
దానిలో రక్తపు అడుగుజాడలు ఉన్నాయి.
9బందిపోటు దొంగల్లా మాటున పొంచి ఉన్నట్లు,
యాజకుల గుంపు పొంచి ఉంది;
షెకెము మార్గంలో వారు హత్య చేస్తారు,
దుర్మార్గపు కుట్రలు చేస్తూ ఉంటారు.
10నేను ఇశ్రాయేలులో ఘోరమైన విషయాన్ని చూశాను:
అక్కడ ఎఫ్రాయిం వ్యభిచారానికి అప్పగించుకుంది,
ఇశ్రాయేలు అపవిత్రపరచబడింది.
11“నేను నా ప్రజలను
మునుపటి స్థితికి తీసుకువచ్చినప్పుడు,
“యూదా వారలారా, మీ కోసం కూడా కోత సిద్ధంగా ఉంది.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
హోషేయ 6: TSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.