యెహెజ్కేలు 40

40
ఆలయ ప్రాంతం పునరుద్ధరణ
1అప్పటికి మేము బందీలుగా వచ్చిన ఇరవై అయిదవ సంవత్సరంలోని మొదటి నెల పదవ రోజున, అనగా పట్టణం నాశనమైన పద్నాలుగవ సంవత్సరంలో ఆ రోజునే యెహోవా హస్తం నా మీదికి వచ్చి ఆయన నన్ను పట్టణానికి తీసుకెళ్లారు. 2దేవుని దర్శనంలో ఆయన నన్ను ఇశ్రాయేలు దేశానికి తీసుకెళ్లి చాలా ఎత్తైన పర్వతం మీద నన్ను ఉంచారు. దాని మీద దక్షిణం వైపున ఒక పట్టణం లాంటిది నాకు కనిపించింది. 3ఆయన నన్ను అక్కడికి తీసుకెళ్లగా మెరుస్తున్న ఇత్తడిలా ఉన్న ఒక వ్యక్తిని నేను చూశాను. అతడు తన చేతిలో నార దారం, కొలిచే కర్ర పట్టుకుని పట్టణ ద్వారంలో నిలబడి ఉన్నాడు. 4ఆ వ్యక్తి నాతో ఇలా అన్నాడు, “మనుష్యకుమారుడా, నేను నీకు చూపించబోయే ప్రతిదాన్ని జాగ్రత్తగా చూసి శ్రద్ధగా విని మనస్సులో ఉంచుకో. వాటిని నీకు చూపించడానికే నేను నిన్ను ఇక్కడికి తీసుకువచ్చాను. నీవు చూసిన ప్రతిదాన్ని ఇశ్రాయేలీయులకు తెలియజేయి.”
తూర్పు ద్వారం నుండి బయటి ఆవరణం వరకు
5ఆలయ ప్రాంతాన్ని పూర్తిగా చుట్టుముట్టిన గోడను నేను చూశాను. ఆ వ్యక్తి చేతిలోని ఉన్న కొలిచే కడ్డీ పొడవు ఆరు మూరలు, ఒక్కొక్కటి ఒక మూర ఒక బెత్తెడు వెడల్పు ఉంది. అతడు గోడను కొలిచాడు; అది ఆ కొలిచే కడ్డీ అంత వెడల్పు, ఆ కడ్డీ అంత ఎత్తు ఉంది.
6అప్పుడతడు తూర్పు వైపున ఉన్న ద్వారం దగ్గరికి వెళ్లి దాని మెట్లెక్కి దాని గుమ్మపు గడపను కొలిచినప్పుడు అది ఒక కొలిచే కర్ర పొడవు ఉంది. 7కావలివారి గది పొడవు వెడల్పులు కొలిచే కర్రంత ఉన్నాయి. ఆ గదులకు మధ్య ఉన్న గోడలు అయిదు మూరల#40:7 అంటే సుమారు 2.7 మీటర్లు; 48 వచనంలో కూడా మందంగా ఉన్నాయి. ద్వారం ప్రక్క నుండి ఆలయానికి ఎదురుగా ఉన్న మంటపానికి ఒక కొలిచే కర్ర లోతు ఉంది.
8అతడు ద్వారపు మంటపం మధ్య కొలిచాడు; 9ద్వారం వాకిలి ఎనిమిది మూరలు,#40:9 అంటే, సుమారు 4.2 మీటర్లు దాని ద్వారబంధాలు రెండు మూరలు#40:9 అంటే, సుమారు 1 మీటరు ఉన్నాయి; ద్వారపు మంటపం మందిరం లోపలి వైపుకు ఉంది.
10తూర్పు ద్వారం లోపల ప్రతి వైపు మూడు కాపలా గదులు ఉన్నాయి; మూడింటికి ఒకే కొలతలు ఉన్నాయి; వాటి రెండు ప్రక్కల ఉన్న ద్వారబంధాలు కూడా ఒకే కొలతలు ఉన్నాయి. 11అప్పుడు అతడు ద్వారాల వాకిళ్లను కొలిచినప్పుడు దాని వెడల్పు పది మూరలు, పొడవు పదమూడు మూరలు#40:11 అంటే సుమారు 5.3 మీటర్ల వెడల్పు 6.9 మీటర్ల పొడవు ఉన్నాయి. 12ప్రతి కాపలా గదికి ఎదురుగా ఉన్న గోడ ఎత్తు ఒక మూర ఉంది. గదులైతే రెండు ప్రక్కలా ఆరు మూరల ఎత్తు ఉన్నాయి. 13అప్పుడతడు ఒక గది పైకప్పు నుండి మరో గది పైకప్పు వరకు ద్వారాన్ని కొలిచినప్పుడు ఇరవై అయిదు మూరల#40:13 అంటే సుమారు 13 మీటర్లు; 21, 25, 29, 30, 33, 36 వచనాల్లో కూడా దూరం ఉంది, రెండు వాకిళ్ల మధ్య కూడా అదే కొలత ఉంది. 14అతడు ద్వారం లోపల భాగం చుట్టూ ఉన్న గోడల వెంబడి అరవై మూరలు#40:14 అంటే, సుమారు 32 మీటర్లు కొలిచాడు. ఆ కొలత ఆవరణానికి ఎదురుగా ఉన్న ప్రాంగణం వరకు. 15బయటి గుమ్మం నుండి లోపలి గుమ్మం ద్వారం యొక్క ఆవరణం వరకు యాభై మూరలు.#40:15 అంటే సుమారు 27 మీటర్లు; 21, 25, 29, 33, 36 వచనాల్లో కూడా 16కాపలా గదులకు ద్వారం లోపల చుట్టూ ఉన్న గోడలకు ప్రక్క గదులకు మూసి ఉన్న కిటికీలు ఉన్నాయి. గోడలోని ద్వారబంధాలు కిటికీలు ఉన్నాయి. ప్రతి ద్వారబంధాన్ని ఖర్జూరం చెట్లతో అలంకరించారు.
బయటి ఆవరణం
17తర్వాత నన్ను బయటి ఆవరణంలోకి తీసుకువచ్చాడు. అక్కడ నేను కొన్ని గదులు, ఆవరణం చుట్టూ నిర్మించబడిన ఒక కాలిబాటను చూశాను; కాలిబాట ప్రక్కగా ముప్పై గదులు ఉన్నాయి. 18ఈ చప్టా ద్వారం వరకు ఉండి వాటి వెడల్పుకు సమానంగా ఉంది. ఇది క్రింది చప్టా. 19అప్పుడు అతడు దిగువ ద్వారం లోపలి నుండి లోపలి ఆవరణం బయట వరకు కొలిచినప్పుడు అది తూర్పు వైపుకు వంద మూరలు ఉత్తరం వైపుకు వంద మూరలు ఉంది.
ఉత్తర ద్వారము
20అప్పుడతడు బయటి ఆవరణానికి దారితీసే ఉత్తరం గుమ్మం పొడవు వెడల్పులను కొలిచాడు. 21దానికి రెండు వైపులా ఉన్న మూడేసి కాపలా గదులను వాటి ద్వారబంధాలను వాటి మధ్య గోడలను కొలిచినప్పుడు వాటి కొలత, మొదటి ద్వారం కొలత ఒక్కటే. పొడవు యాభై మూరలు, వెడల్పు ఇరవై అయిదు మూరలు ఉంది. 22వాటి కిటికీలు మధ్య గోడలు, ఖర్జూరం చెట్లతో అలంకరించిన ద్వారబంధాల కొలతలన్నీ తూర్పు గుమ్మం కొలతతో సమానంగా ఉన్నాయి. పైకి ఎక్కడానికి ఏడు మెట్లున్నాయి. వాటికి ఎదురుగా దాని మధ్య గోడలు ఉన్నాయి. 23తూర్పు ద్వారంలా ఉత్తర ద్వారానికి ఎదురుగా లోపలి ఆవరణానికి దారితీసే ఒక గుమ్మం ఉంది. ఈ ద్వారం నుండి ఆ ద్వారం వరకు దూరం కొలిచినప్పుడు అది వంద మూరలు ఉంది.
దక్షిణ ద్వారం
24అప్పుడతడు నన్ను దక్షిణం వైపుకు తీసుకెళ్లగా అక్కడ దక్షిణ ద్వారం కనిపించింది. దాని ద్వారబంధాలను మధ్య గోడలను కొలిచినప్పుడు దీని కొలత ఇతర ద్వారాల కొలతలు ఒక్కటే. 25వాటికి ఉన్నట్లుగానే దీనికి కూడా దీని మధ్యగోడలకు చుట్టూ కిటికీలు ఉన్నాయి. ద్వారం పొడవు యాభై మూరలు, వెడల్పు ఇరవై అయిదు మూరలు ఉంది. 26పైకి ఎక్కడానికి ఏడు మెట్లున్నాయి. వాటికి ఎదురుగా దాని మధ్య గోడలు ఉన్నాయి. రెండు వైపులా ఖర్జూరం చెట్లతో అలంకరించిన ద్వారబంధాలు ఉన్నాయి. 27అతడు ఈ ద్వారం నుండి దక్షిణం వైపున ఉన్న బయటి ద్వారం వరకు కొలిచినప్పుడు అది వంద మూరలు ఉంది.
లోపలి ఆవరణానికి ద్వారాలు
28అప్పుడతడు దక్షిణ ద్వారం గుండా లోపలి ఆవరణంలోకి నన్ను తీసుకువచ్చి దక్షిణ ద్వారాన్ని కొలిచాడు; దీని కొలతలు ఇతర ద్వారాల కొలతలు ఒక్కటే. 29దాని కాపలా గదులు ద్వారబంధాలు వాటి మధ్య గోడల కొలతలు మిగతా వాటి కొలతలు ఒక్కటే. దానికి చుట్టూ ఉన్న మధ్యగోడలకు కిటికీలు ఉన్నాయి. దాని పొడవు యాభై మూరలు, వెడల్పు ఇరవై అయిదు మూరలు ఉంది. 30లోపలి ఆవరణం చుట్టూ ఉన్న మధ్య గోడల పొడవు ఇరవై అయిదు మూరలు వెడల్పు అయిదు మూరలు. 31దాని మధ్య గోడలు బయటి ఆవరణానికి ఎదురుగా ఉన్నాయి; దాని ద్వారబంధాల మీద ఖర్జూరం చెట్లతో అలంకరించారు, పైకి ఎక్కడానికి ఎనిమిది మెట్లున్నాయి.
32అప్పుడతడు నన్ను తూర్పు వైపున ఉన్న లోపలి ఆవరణం దగ్గరికి తీసుకువచ్చి దాని ద్వారాన్ని కొలిచాడు; దాని కొలతలు ఇతర ద్వారాల కొలతలు ఒక్కటే. 33దాని కాపలా గదులు ద్వారబంధాలు వాటి మధ్య గోడల కొలతలు మిగతా వాటి కొలతలు ఒక్కటే. దానికి చుట్టూ ఉన్న మధ్యగోడలకు కిటికీలు ఉన్నాయి. దాని పొడవు యాభై మూరలు, వెడల్పు ఇరవై అయిదు మూరలు ఉంది. 34దాని ద్వారబంధాలు బయట ఆవరణానికి ఎదురుగా ఉన్నాయి; దాని ద్వారబంధాల మీద రెండు వైపులా ఖర్జూరం చెట్లతో అలంకరించారు, పైకి ఎక్కడానికి ఎనిమిది మెట్లున్నాయి.
35అప్పుడతడు నన్ను ఉత్తర ద్వారం దగ్గరికి తీసుకువచ్చి దానిని కొలిచాడు; దాని కొలతలు ఇతర ద్వారాల కొలతలు ఒక్కటే. 36అలాగే కాపలా గదులు ద్వారబంధాలు వాటి మధ్య గోడల కొలతలు మిగతా వాటి కొలతలు ఒక్కటే. దానికి చుట్టూ ఉన్న మధ్యగోడలకు కిటికీలు ఉన్నాయి. దాని పొడవు యాభై మూరలు, వెడల్పు ఇరవై అయిదు మూరలు ఉంది. 37దాని ద్వారబంధాలు బయట ఆవరణానికి ఎదురుగా ఉన్నాయి; దాని ద్వారబంధాల మీద రెండు వైపులా ఖర్జూరం చెట్లతో అలంకరించారు, పైకి ఎక్కడానికి ఎనిమిది మెట్లున్నాయి.
బలులు సిద్ధపరచడానికి గదులు
38ప్రతి లోపలి ద్వారంలో మంటపం దగ్గర ద్వారం ఉన్న గది ఉంది, ఇక్కడ దహనబలుల మాంసం కడుగుతారు. 39ద్వారపు మంటపానికి రెండు వైపులా రెండు బల్లలు ఉన్నాయి; వాటిపై దహనబలులు, పాపపరిహార బలులు,#40:39 లేదా శుద్ధీకరణ అర్పణ అపరాధబలులను వధిస్తారు. 40ద్వారం యొక్క బయటి మంటపం దగ్గర ఉత్తర ద్వారం మెట్లు ఎక్కే చోట రెండు బల్లలు, మెట్లకు అవతలి వైపు రెండు బల్లలు ఉన్నాయి. 41ద్వారానికి ఒక్కో వైపు నాలుగు చొప్పున రెండు వైపులా ఎనిమిది బల్లలు ఉన్నాయి; వాటిపై బలులు వధిస్తారు. 42అంతే కాకుండా దహనబలుల కోసం చెక్కిన రాతితో చేసిన నాలుగు బల్లలు ఉన్నాయి; వాటి పొడవు మూరన్నర వెడల్పు మూరన్నర ఎత్తు ఒక మూర.#40:42 అంటే, సుమారు 80 సెం.మీ. పొడవు 53 సెం.మీ. ఎత్తు దహనబలులు ఇతర బలులు వధించడానికి ఉపయోగించే పాత్రలు వాటిపై ఉంచారు. 43చుట్టూ ఉన్న గోడకు ఒక బెత్తెడు పొడవు ఉన్న మేకులు తగిలించి ఉన్నాయి. అర్పణల మాంసాన్ని ఆ బల్లల మీద ఉంచుతారు.
యాజకులకు గదులు
44లోపలి ఆవరణంలో లోపలి ద్వారం బయట రెండు గదులు ఉన్నాయి. ఒకటి ఉత్తర ద్వారం దగ్గర దక్షిణం వైపుగా ఒకటి, తూర్పు ద్వారం దగ్గర ఉత్తరం వైపుగా ఒకటి ఉన్నాయి. 45అతడు నాతో ఇలా అన్నాడు, “దక్షిణం వైపుగా ఉన్న గది మందిరాన్ని కాపలా కాసే యాజకుల కోసము. 46ఉత్తరం వైపుగా ఉన్న గది బలిపీఠాన్ని కాపలా కాసే యాజకుల కోసము. లేవీయులలో సాదోకు వారసులైన వీరు యెహోవా సన్నిధిలో సేవ చేయటానికి వస్తారు.”
47అప్పుడతడు ఆవరణాన్ని కొలిచినప్పుడు అది చతురస్రాకారంలో ఉండి పొడవు వెడల్పులు వంద మూరలు ఉన్నాయి. ఆలయానికి ఎదురుగా బలిపీఠం ఉంది.
నూతన మందిరం
48అప్పుడతడు ఆలయ మంటపంలోకి నన్ను తీసుకెళ్లి దాని స్తంభాలను కొలిచాడు; రెండు వైపులా వాటి వెడల్పు అయిదు మూరలు. దాని ద్వారం వెడల్పు పద్నాలుగు మూరలు#40:48 అంటే, సుమారు 7.4 మీటర్లు ఉంది, దానికి రెండు వైపులా ఉన్న గోడ మందం మూడు మూరలు.#40:48 అంటే, సుమారు 1.6 మీటర్లు 49మంటపం పొడవు ఇరవై మూరలు.#40:49 అంటే, సుమారు 11 మీటర్లు వెడల్పు పన్నెండు#40:49 కొ. ప్రా. ప్ర. లలో పదకొండు మూరలు.#40:49 అంటే, సుమారు 6.4 మీటర్లు దానిపైకి ఎక్కడానికి మెట్లున్నాయి,#40:49 కొ. ప్రా. ప్ర. లలో 10 మెట్లు దాని ద్వారబంధాలకు రెండు వైపులా స్తంభాలు ఉన్నాయి.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

యెహెజ్కేలు 40: TSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి

యెహెజ్కేలు 40 కోసం వీడియో