యెహెజ్కేలు 40:1-6

యెహెజ్కేలు 40:1-6 TSA

అప్పటికి మేము బందీలుగా వచ్చిన ఇరవై అయిదవ సంవత్సరంలోని మొదటి నెల పదవ రోజున, అనగా పట్టణం నాశనమైన పద్నాలుగవ సంవత్సరంలో ఆ రోజునే యెహోవా హస్తం నా మీదికి వచ్చి ఆయన నన్ను పట్టణానికి తీసుకెళ్లారు. దేవుని దర్శనంలో ఆయన నన్ను ఇశ్రాయేలు దేశానికి తీసుకెళ్లి చాలా ఎత్తైన పర్వతం మీద నన్ను ఉంచారు. దాని మీద దక్షిణం వైపున ఒక పట్టణం లాంటిది నాకు కనిపించింది. ఆయన నన్ను అక్కడికి తీసుకెళ్లగా మెరుస్తున్న ఇత్తడిలా ఉన్న ఒక వ్యక్తిని నేను చూశాను. అతడు తన చేతిలో నార దారం, కొలిచే కర్ర పట్టుకుని పట్టణ ద్వారంలో నిలబడి ఉన్నాడు. ఆ వ్యక్తి నాతో ఇలా అన్నాడు, “మనుష్యకుమారుడా, నేను నీకు చూపించబోయే ప్రతిదాన్ని జాగ్రత్తగా చూసి శ్రద్ధగా విని మనస్సులో ఉంచుకో. వాటిని నీకు చూపించడానికే నేను నిన్ను ఇక్కడికి తీసుకువచ్చాను. నీవు చూసిన ప్రతిదాన్ని ఇశ్రాయేలీయులకు తెలియజేయి.” ఆలయ ప్రాంతాన్ని పూర్తిగా చుట్టుముట్టిన గోడను నేను చూశాను. ఆ వ్యక్తి చేతిలోని ఉన్న కొలిచే కడ్డీ పొడవు ఆరు మూరలు, ఒక్కొక్కటి ఒక మూర ఒక బెత్తెడు వెడల్పు ఉంది. అతడు గోడను కొలిచాడు; అది ఆ కొలిచే కడ్డీ అంత వెడల్పు, ఆ కడ్డీ అంత ఎత్తు ఉంది. అప్పుడతడు తూర్పు వైపున ఉన్న ద్వారం దగ్గరికి వెళ్లి దాని మెట్లెక్కి దాని గుమ్మపు గడపను కొలిచినప్పుడు అది ఒక కొలిచే కర్ర పొడవు ఉంది.

Read యెహెజ్కేలు 40

యెహెజ్కేలు 40:1-6 కోసం వీడియో