యెహెజ్కేలు 34:20-24

యెహెజ్కేలు 34:20-24 TSA

“ ‘ప్రభువైన యెహోవా వారికి చెబుతున్న మాట ఇదే: క్రొవ్విన గొర్రెలకు బక్కచిక్కిన గొర్రెలకు మధ్య నేనే తీర్పు తీరుస్తాను. మీరు కొమ్ములతో పొడుస్తూ, భుజంతో ప్రక్కలతో తోస్తూ బలహీనమైన గొర్రెలన్నిటిని తరిమికొడుతున్నారు కాబట్టి, నేను నా గొర్రెలను కాపాడతాను, ఇకపై అవి దోచుకోబడవు. గొర్రెకు మధ్య నేను తీర్పు తీరుస్తాను. వాటిని మేపడానికి నేను నా సేవకుడైన దావీదును కాపరిగా నియమిస్తాను. అతడు వాటిని కాస్తాడు; అతడు వాటిని మేపుతాడు, వాటికి కాపరిగా ఉంటాడు. యెహోవానైన నేను వారికి దేవునిగా ఉంటాను, నా సేవకుడైన దావీదు వాటికి అధిపతిగా ఉంటాడు. యెహోవానైన నేను మాట చెప్పాను.

Read యెహెజ్కేలు 34

యెహెజ్కేలు 34:20-24 కోసం వీడియో