పిల్లలారా, ప్రభువులో మీ తల్లిదండ్రులకు విధేయులై యుండండి, అది సరియైనది. “మీ తండ్రిని తల్లిని గౌరవించాలి, ఇది వాగ్దానంతో కూడిన మొదటి ఆజ్ఞ. దాని వలన మీకు మేలు కలుగుతుంది, మీరు సంతోషంగా భూమి మీద దీర్ఘాయువు కలిగి జీవిస్తారు.” తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపకుండా ప్రభువు బోధలో క్రమశిక్షణలో వారిని పెంచండి. దాసులారా, మీరు క్రీస్తుకు లోబడినట్టు ఈ లోకసంబంధమైన మీ యజమానులకు గౌరవంతో, యదార్థ హృదయం గలవారై భయంతో లోబడి ఉండండి. వారి కనుదృష్టి మీ మీద ఉన్నప్పుడు వారి దయను పొందాలని కాకుండా, క్రీస్తు దాసులమని తెలుసుకొని, దేవుని చిత్తాన్ని మనస్ఫూర్తిగా చేస్తూ వారికి లోబడండి. మనష్యులకు చేసినట్లు కాక, ప్రభువును సేవించినట్లే హృదయపూర్వకంగా సేవ చేయండి. ఎందుకంటే, దాసులైనా, స్వతంత్రులైనా మీలో ప్రతివారు ఏ మంచి కార్యాన్ని చేస్తారో దాని ఫలాన్ని ప్రభువు నుండి పొందుతారని మీకు తెలుసు. అయితే యజమానులారా, మీరు కూడా మీ దాసుల పట్ల అలాగే ప్రవర్తించండి. ఎందుకంటే మీ ఇద్దరి యజమాని పరలోకంలో ఉన్నారు, ఆయన పక్షపాతం చూపడని మీకు తెలుసు కనుక వారిని బెదిరించకండి.
Read ఎఫెసీయులకు 6
వినండి ఎఫెసీయులకు 6
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: ఎఫెసీయులకు 6:1-9
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు