ప్రసంగి 10
10
1పరిమళతైలంలో పడిన చచ్చిన ఈగలు దానికి చెడు వాసన తెచ్చినట్లు,
కొంచెం మూర్ఖత్వం జ్ఞానాన్ని ఘనతను పాడుచేస్తుంది.
2జ్ఞాని హృదయం కుడి చేతిలో ఉంటుంది,
కాని మూర్ఖుడి హృదయం ఎడమ చేతిలో ఉంటుంది.
3తెలివిలేనివారు దారిలో సరిగా నడవలేక
వారు ఎంత తెలివితక్కువ వారు అనేది
అందరికి చూపిస్తారు.
4వారు ఎంత తెలివితక్కువ వారు అనేది,
మీ ఉద్యోగాన్ని వదిలేయవద్దు;
ప్రశాంతత గొప్ప నేరాలు జరుగకుండ ఆపుతుంది.
5నేను సూర్యుని క్రింద ఒక చెడ్డ విషయాన్ని చూశాను,
ఒక పాలకుడు పొరపాటున చేసిన అన్యాయం:
6అదేమిటంటే మూర్ఖులను ఉన్నత పదవులలో,
సమర్థులను దిగువ స్థాయిలో ఉంచడమే.
7నేను బానిసలు గుర్రాలపై,
యువరాజులు బానిసల్లా కాలినడకన వెళ్లడం చూశాను.
8గొయ్యి త్రవ్వినవారే అందులో పడతారు;
గోడను పడగొట్టిన వారే పాము కాటుకు గురవుతారు.
9రాళ్లు దొర్లించేవారు దానివల్ల గాయపడతారు;
మొద్దులను చీల్చేవారు వాటి వల్ల ప్రమాదానికి గురి అవుతారు.
10ఒకవేళ గొడ్డలి మొద్దుబారి
దాని అంచుకు పదును పెట్టకపోతే,
ఎక్కువ బలం ఉపయోగించాల్సి ఉంటుంది,
అయితే జ్ఞానం విజయాన్ని తెస్తుంది.
11ఒకవేళ లొంగదీయక ముందే పాము కాటేస్తే,
పాములు ఆడించేవానికి లాభం ఉండదు.
12జ్ఞానుల నోటి నుండి వచ్చే మాటలు దయగలవి,
కాని మూర్ఖుని పెదవులు వానినే మ్రింగివేస్తాయి.
13అవివేకంతో మొదలైన వారి మాటలు;
దుర్మార్గపు వెర్రితనంతో ముగుస్తాయి;
14అయినా మూర్ఖులు వాగుతూనే ఉంటారు.
ఏమి జరుగుతుందో ఎవరికి తెలియదు
వారు చనిపోయిన తర్వాత ఏమి జరుగుతుందో ఎవరు చెప్పగలరు?
15మూర్ఖులకు పట్టణానికి వెళ్లడానికి దారి తెలియదు;
కాబట్టి తమ శ్రమతో వారు అలసిపోతారు.
16దాసుడు#10:16 లేదా రాజు బాలుడు రాజుగా ఉన్న దేశానికి
ఉదయాన్నే విందు చేసుకొనే యువరాజులు ఉన్న దేశానికి శ్రమ.
17గొప్ప జన్మ కలిగినవాడు రాజుగా ఉన్న దేశం
మత్తు కోసం కాక బలం కోసం సరైన సమయంలో
భోజనానికి కూర్చునే అధిపతులు ఉన్న దేశం ధన్యమైనది.
18ఒకని సోమరితనం వల్ల ఇంటికప్పు కూలిపోతుంది,
ఒకని బద్దకం వల్ల ఇల్లు కారిపోతుంది.
19నవ్వడం కోసం విందు చేస్తారు,
ద్రాక్షరసం జీవితానికి సంతోషం కలిగిస్తుంది,
డబ్బు ప్రతిదానికీ సమాధానం.
20మీ ఆలోచనలో కూడా రాజును తిట్టవద్దు,
మీ పడకగదిలో కూడా ధనికులను శపించవద్దు,
ఎందుకంటే ఆకాశపక్షులు,
రెక్కలున్న పక్షులు మీరు చెప్పేవాటిని బయట పెట్టవచ్చు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
ప్రసంగి 10: TSA
హైలైట్
షేర్ చేయి
కాపీ

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.