కొలొస్సయులకు 1:15-22

కొలొస్సయులకు 1:15-22 TCV

కుమారుడు అదృశ్య దేవుని స్వరూపము, సృష్టంతటి కంటే మొదట జన్మించిన వాడు. ఎందుకనగా, ఆయనలోనే సమస్తం సృష్టించబడ్డాయి, అనగా: ఆకాశంలో ఉన్నవి, భూమిపై ఉన్నవి, కంటికి కనబడేవి కనబడనివి, సింహాసనాలైనా లేక ప్రభుత్వాలైనా లేక పాలకులైనా లేక అధికారులైనా, సమస్తం ఆయన ద్వారానే ఆయన కొరకే సృష్టించబడ్డాయి. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్న వాడు, సమస్తానికి ఆయనే ఆధారం. ఆయనే సంఘమనే శరీరానికి శిరస్సు, ఆయనకు అన్నిటిలో సర్వాధికారం కలిగివుండడానికి ఆయనే ఆరంభము, మృతులలో నుండి లేచుటలో ప్రథముడయ్యారు. ఆయనలో దేవుని సంపూర్ణత నివసించాలని తండ్రి యొక్క దేవుని ఉద్దేశం. ఆయన ద్వారా సమస్తాన్ని అనగా, భూమిపై ఉన్న లేదా పరలోకంలో ఉన్న, అన్నిటిని, క్రీస్తు సిలువలో కార్చిన రక్తం ద్వారా రాజీపరచి, క్రీస్తు ద్వారా తనలో సమాధానపరచుకోవడం తండ్రికి ఇష్టమయ్యింది. ఒకప్పుడు మీరు దేవుని నుండి దూరం అయ్యారు, మీ దుష్ట ప్రవర్తన వలన మీ మనస్సులో విరోధులయ్యారు. అయితే, దేవుడు మిమ్మల్ని పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిరపరాధులుగా తన సన్నిధిలో నిలబెట్టడానికి యేసు యొక్క భౌతికమైన శరీరం మరణించుట ద్వారా ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరిచారు.

కొలొస్సయులకు 1:15-22 కోసం వీడియో

Free Reading Plans and Devotionals related to కొలొస్సయులకు 1:15-22