2 కొరింథీ 6

6
1దేవుని తోటి పనివారిగా మేము, మీరు పొందిన దేవుని కృపను వ్యర్థం చేసుకోవద్దని మిమ్మల్ని కోరుతున్నాం. 2అయితే,
“నా అనుకూల సమయంలో నీ మొర ఆలకించాను,
రక్షణ దిన మందు నేను నీకు సహాయం చేశాను”#6:2 యెషయా 49:8
అని ఆయన చెప్తున్నారు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం అని మీకు నేను చెప్తున్నాను.
పౌలు కష్టాలు
3మా పరిచర్య అవమానపరచబడకుండా ఉండడానికి, మేము ఎవరి మార్గానికి ఆటంకాన్ని కలిగించం. 4కాని, మేము దేవుని సేవకులంగా మాకు మేమే అన్ని విధాలుగా పొగడుకుంటాము: గొప్ప సహనంలో, సమస్యల్లో, కష్టాల్లో దుఃఖాల్లో; 5దెబ్బల్లో, చెరసాలల్లో, అల్లరుల్లో; కష్టమైన పనిలో, నిద్రలేని రాత్రుల్లో ఆకలిలో; 6పవిత్రతలో, అవగాహనలో, ఓర్పులో దయలో; పరిశుద్ధాత్మలో నిజమైన ప్రేమలో; 7సత్యంగా మాట్లాడంలో దేవుని శక్తిలో; కుడిచేతిలో ఎడమ చేతిలో నీతి అనే ఆయుధాలను కలిగి; 8గౌరవించబడి అవమానించబడి, చెడు సమాచారం మంచి సమాచారం; నిష్కళంకులమైనా వంచకులుగా ఎంచబడ్డాము; 9తెలిసినవారమైనా తెలియనివారిగా ఎంచబడ్డాము; మరణిస్తున్నా జీవిస్తూనే ఉన్నాం; కొట్టబడ్డాం కాని చంపబడలేదు; 10దుఃఖపడినా ఎల్లప్పుడు సంతోషిస్తూనే ఉన్నాం; మేము పేదలం కాని అనేకమందిని ధనవంతులుగా చేస్తున్నాము; ఏమి లేదు కాని సమస్తాన్ని కలిగి ఉన్నాం.
11కొరింథీయులారా, మేము మీతో స్వేచ్ఛగా మాట్లాడాము, మా హృదయాలను మీ యెదుట విశాలంగా తెరిచాము. 12మా అభిమానాన్ని మీ నుండి మేము తగ్గించడం లేదు, కానీ మా నుండి మిమ్మల్ని మీరే దూరం ఉంచుతున్నారు. 13నా బిడ్డలుగా భావించి నేను మీతో మాట్లాడుతున్నాను, మాలా మీరు కూడా మీ హృదయాలను విశాలంగా తెరవండి.
విగ్రహారాధనకు వ్యతిరేకంగా హెచ్చరిక
14అవిశ్వాసులతో కలిసి ఉండకండి. ఎందుకంటే, నీతి అవినీతి ఎలా కలిసివుంటాయి? చీకటి వెలుతురు ఎలా కలిసివుంటాయి? 15క్రీస్తుకు బెలియాలుతో ఏమి సంబంధం? విశ్వాసికి, అవిశ్వాసికి పొత్తు ఏమిటి? 16దేవాలయాలకు విగ్రహాలకు మధ్య ఉన్న ఒప్పందం ఏమిటి? కాబట్టి మనం జీవంగల దేవుని ఆలయమై ఉన్నాం. దేవుడు ఇలా చెప్పారు:
“నేను వారితో నివసిస్తాను
వారి మధ్య నడుస్తాను,
నేను వారి దేవునిగా ఉంటాను,
వారు నా ప్రజలుగా ఉంటారు.”#6:16 లేవీ 26:12; యిర్మీయా 32:38; యెహె 37:27
17కనుక,
“వారి మధ్య నుండి బయటకు వచ్చి
ప్రత్యేకంగా ఉండండి,
అని ప్రభువు చెప్తున్నాడు.
అపవిత్రమైన వాటిని ముట్టకండి,
అప్పుడు నేను మిమ్మల్ని చేర్చుకుంటాను.#6:17 యెషయా 52:11; యెహె 20:34,41
18ఇంకా,
“నేను మీకు తండ్రిగా ఉంటాను,
మీరు నాకు కుమారులు కుమార్తెలుగా ఉంటారు,
అని సర్వశక్తిగల ప్రభువు చెప్తున్నాడు.”#6:18 2 సమూ 7:14; 7:8

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

2 కొరింథీ 6: TCV

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి