2 కొరింథీ పత్రిక 1
1
1దేవుని చిత్తాన్ని బట్టి క్రీస్తు యేసు అపొస్తలుడైన పౌలు, మన సోదరుడు తిమోతి,
కొరింథీలోని దేవుని సంఘానికి, అకాయ ప్రాంతమంతటిలోని దేవుని పరిశుద్ధులందరికి కలిపి వ్రాయునది:
2మన తండ్రియైన దేవుని నుండి, ప్రభువైన యేసు క్రీస్తు నుండి మీకు కృపా సమాధానం కలుగును గాక.
అన్ని విధాలా ఆదరణనిచ్చే దేవునికి స్తోత్రాలు
3మన యేసు క్రీస్తు ప్రభువుకు తండ్రియైన దేవునికి కృతజ్ఞతలు చెల్లింద్దాము. మన తండ్రి కనికరం గలవాడు. సమస్త అన్ని విధాలా ఆదరణనిచ్చే దేవుడు. 4దేవుడు మనల్ని ఏ ఆదరణతో ఆదరిస్తున్నారో, అదే ఆదరణతో అలాంటి కష్టాల్లో ఉన్నవారిని ఆదరించగలిగేలా ఆయన మమ్మల్ని ఆదరిస్తున్నారు. 5క్రీస్తు శ్రమలలో మనం ఎంత ఎక్కువ భాగం పంచుకున్నామో క్రీస్తు ఆదరణ కూడా అంతే ఎక్కువగా మనకు కలుగుతుంది. 6మేము శ్రమపడడం మీకు ఆదరణ కోసం రక్షణ కోసమే. ఆదరణ లభిస్తే అది మీ కొరకే కాబట్టి మేము పడిన కష్టాలను మీరు కూడా ఓపికతో భరించడానికి శక్తి లభిస్తుంది. 7మీరు మా కష్టాల్లో పాలివారైనట్లే ఆదరణలో కూడా పాలుపంచుకుంటారని మాకు తెలుసు. కాబట్టి మీలో మా నిరీక్షణ స్థిరంగా ఉంది.
8సహోదరి సహోదరులారా, ఆసియా ప్రాంతంలో మాకు ఎదురైన కష్టాల గురించి మీకు చెప్పకుండా ఉండాలని అనుకోవడం లేదు. మేము మా శక్తికి మించిన కష్టాలను అనుభవించాము. కాబట్టి మేము జీవితంపై ఆశ వదులుకున్నాము. 9మాకు మరణశిక్ష విధించబడినట్లుగా భావించించాము. మేము మాపై ఆధారపడక, మృతులను కూడ పునరుత్ధానులుగా చేసిన దేవునిపై ఆధారపడడానికే అలా జరిగింది. 10మరణకరమైన భయంకర ప్రమాదాల నుండి ఆయన మమ్మల్ని కాపాడారు. ఇకముందు కూడా కాపాడతారు. ఇకముందు కూడ కాపాడతాడు. ఆయన తిరిగి మమ్మల్ని కాపాడతారని ఆయనలో నిరీక్షణ కలిగి ఉన్నాము. 11మీ ప్రార్థనల ద్వారా మాకు సహాయం చేస్తున్నారు, కాబట్టి వాటిలో అనేక ప్రార్థనలకు జవాబుగా దేవుడు మామీద దయ చూపినందుకు మా పక్షంగా అనేకులు కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు.
పౌలు ప్రణాళికలో మార్పు
12ఇప్పుడు ఇది మాకు గర్వకారణం: ముఖ్యంగా మీతో మాకు గల సంబంధం విషయంలో నిజాయితితో, దేవుడు ఇచ్చే పవిత్రతతో మేము నడచుకున్నాము. లోకజ్ఞానంపై ఆధారపడక దేవుని కృపపై ఆధారపడి నడుచుకున్నామని మా మనస్సాక్షి సాక్ష్యమిస్తుంది. 13ఎందుకంటే, మీరు చదివి, అర్థం చేసుకోగలిగిన సంగతులను మాత్రమే మీకు వ్రాస్తున్నానని నేను అనుకుంటున్నాను. 14ఇప్పుడు మీరు కొంతవరకు మాత్రమే అర్థం చేసుకోగల విషయాన్ని, రాబోవు కాలంలో సంపూర్ణంగా గ్రహిస్తారని నేను నిరీక్షిస్తున్నాను. అప్పుడు యేసు ప్రభువు దినాన మమ్మల్ని చూసి మీరు ఎంతగా గర్విస్తారో, మిమ్మల్ని చూసి మేము కూడా అలాగే గర్విస్తాము.
15దీన్ని గురించి నాకు చాలా నమ్మకం ఉన్నందువల్ల, మీకు రెట్టింపు ఆనందం కలిగేలా నేను మొదట మిమ్మల్ని చూడడానికి రావాలని అనుకున్నాను. 16నేను మాసిదోనియాకు వెళ్లేటప్పుడు, అక్కడ నుండి తిరిగి వచ్చేటప్పుడు మీ దగ్గరకు రావాలని, మీరు నన్ను యూదయకు పంపాలని అనుకున్నాను. 17నేను ఇలా ఆలోచించి అస్థిరంగా నడుచుకున్నానా? నేను స్వార్థంగా ఆలోచిస్తున్నానా? ఔను ఔనని చెప్తూ కాదు కాదని చెప్తున్నానా?
18అయితే దేవుడు నమ్మదగినవాడు కాబట్టి, మా వర్తమానం “అవునని” చెప్పి “కాదు” అనేలా ఉండదు. 19ఎందుకంటే సీల#1:19 గ్రీకులో సిల్వాను సీల యొక్క మరో రూపం ద్వారా, తిమోతి ద్వారా, నా ద్వారా మీకు బోధించబడిన దేవుని కుమారుడైన యేసు క్రీస్తు అవునని చెప్పి, కాదనేవాడు కాడు. 20ఎందుకంటే, దేవుని వాగ్దానాలన్ని క్రీస్తులో “అవును” అన్నట్లుగా ఉన్నాయి. అందుకే, దేవునికి మహిమ కలుగడానికి యేసు క్రీస్తు ద్వారా మనం “ఆమేన్” అని అంటున్నాము. 21మీతో కూడా క్రీస్తులో నిలిచి ఉండేలా, మమ్మల్ని స్థిరపరచి అభిషేకించినవాడు దేవుడే. 22ఆయనే తన ముద్రను మనపై వేసి మనల్ని తన వారిగా ప్రకటించారు. ఆయన మనకిచ్చిన వాటిని ధృవపరచడానికి మన హృదయాల్లో పవిత్రాత్మను అనుగ్రహించారు.
23నా ప్రాణం తోడు దేవుడే దీనికి సాక్షిగా పెట్టుకున్నాను; మిమ్మల్ని బాధపెట్టడం ఇష్టం లేనందువల్ల నేను తిరిగి కొరింథీకి రాలేదు. 24అందుకే మీరు విశ్వాసం వల్ల దృఢంగా నిలిచి ఉన్నారు. కాబట్టి మీ విశ్వాస విషయమై మేము ఆజ్ఞాపించడంలేదు. పైగా మేము మీ సంతోషం కోసం మీ తోటిపనివారిగా పనిచేస్తున్నాము.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
2 కొరింథీ పత్రిక 1: TSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.