1 కొరింథీ పత్రిక 5

5
లైంగిక దుర్నీతి విషయంలో చేయవలసినవి
1మీ మధ్య వ్యభిచారం ఉన్నదని మేము విన్నాము. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట కదా! ఇలాంటి వ్యభిచారం దేవుని ఎరుగనివారు కూడా సహించరు. 2ఇలా ఉండి కూడా మీరు గర్విస్తున్నారా! నిజానికి ఈ విషయం గురించి మీరు దుఃఖించి ఈ పని చేసిన వానిని మీ సహవాసం నుండి వెలివేయాలి కదా! 3నా మట్టుకైతే, నేను శారీరకంగా మీతో అక్కడ లేకపోయినా నా ఆత్మలో నేను మీతోనే ఉన్నాను. కాబట్టి మీతో ఉన్న వానిగానే మన ప్రభువైన యేసు నామంలో ఈ పని చేసిన వాని మీద తీర్పు ఇదివరకే తెలియజేశాను. 4ఎలాగంటే, ప్రభు యేసు నామంలో మీరు సమకూడినప్పుడు ప్రభువైన యేసు శక్తి ద్వారా నేను ఆత్మలో మీతో ఉన్నాను. 5కాబట్టి ప్రభువు దినాన వాని ఆత్మ రక్షించబడేలా వాని శరీరం నశించడానికి వానిని సాతానుకు అప్పగించాలి.
6మీరు ఆ విషయంలో గర్వించడం మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమే అయినా మొత్తం పిండిని పులియజేస్తుందని మీకు తెలుసు కదా! 7క్రీస్తు అనే మన పస్కా గొర్రెపిల్ల మీ కోసం వధించబడి ప్రాయశ్చిత్తం చేశారు కాబట్టి మీరు పులియని క్రొత్త పిండి ముద్దగా ఉండడానికి పులిసిన పాత పిండిని పారవేయండి. 8కాబట్టి అసూయ, దుర్మార్గం అనే పులిసిన పాత పిండితో కాకుండా నిజాయితీ సత్యమనే పులియని రొట్టెతో పస్కా పండుగ ఆచరిద్దాము.
9లైంగిక దుర్నీతి కలిగినవారితో సహవాసం చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాశాను. 10అయితే నేను, ఈ లోకపు వ్యభిచారులతో గాని, అత్యాశపరులతో గాని, మోసం చేసేవారితో గాని, విగ్రహారాధికులతో గాని ఏమాత్రం కలిసి ఉండవద్దని చెప్పడం లేదు, అలాగైతే మీరు లోకాన్నే విడిచి వెళ్లవలసి ఉంటుంది కదా! 11ఇప్పుడైతే, సహోదరి అని సహోదరుడని పిలువబడే సంఘసభ్యుల గురించి వ్రాస్తున్నాను. ఎవరైనా వ్యభిచారిగా, అత్యాశపరునిగా, విగ్రహారాధికునిగా లేదా నిందలువేసే వారిగా, త్రాగుబోతుగా లేదా మోసగానిగా ఉంటే అలాంటి వారితో కలిసి ఉండవద్దు. అలాంటి వారితో భోజనం కూడా చేయవద్దని మీకు వ్రాస్తున్నాను.
12సంఘానికి బయట ఉన్నవారిని విమర్శించడం నాకెందుకు? మీకు సంఘసభ్యులను తీర్చు తీర్చే బాధ్యత లేదా? 13సంఘం బయటివారికి దేవుడే తీర్పు తీరుస్తారు. కాబట్టి వాక్యంలో ఉన్నట్లు, “ఆ దుష్టున్ని మీ మధ్య నుండి వెలివేయండి.”#5:13 ద్వితీ 13:5; 17:7; 19:19; 21:21; 22:21,24; 24:7

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

1 కొరింథీ పత్రిక 5: TSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి