కీర్తనల గ్రంథము 57

57
సంగీత నాయకునికి: “నాశనం చేయవద్దు” రాగం. దావీదు అనుపదగీతం. గుహలో సౌలు నుండి అతడు పారిపోయినప్పటిది.
1దేవా, నన్ను కరుణించు
నా ఆత్మ నిన్నే నమ్ముకొన్నది గనుక దయ చూపించుము.
కష్టం దాటిపోయేవరకు
నేను నీ శరణు జొచ్చియున్నాను.
2మహోన్నతుడైన దేవుని సహాయం కోసం నేను ప్రార్థించాను.
దేవుడు నా విషయమై సంపూర్ణ జాగ్రత్త తీసుకొంటాడు.
3పరలోకము నుండి ఆయన నాకు సహాయం చేసి, నన్ను రక్షిస్తాడు.
నన్ను ఇబ్బందిపెట్టే మనుష్యులను ఆయన శిక్షిస్తాడు.
దేవుడు తన నిజమైన ప్రేమను
నాకు చూపిస్తాడు.
4నా జీవితం ప్రమాదంలో ఉంది.
నా శత్రువులు నా చుట్టూరా ఉన్నారు.
ఈటెలు, బాణాలవంటి పదునైన పళ్లు,
మనుష్యులను తినే ఖడ్గంలా పదునైన నాలుకలుగల సింహాల్లా వారున్నారు.
5దేవా, నీవు ఆకాశాలకంటె ఎత్తుగా హెచ్చింపబడ్డావు.
నీ మహిమ భూమిని ఆవరించి ఉంది.
6నా శత్రువులు నాకు ఉచ్చు వేసారు.
వారు నన్ను ఉచ్చులో పట్టుకోవాలని చూస్తున్నారు.
నేను పడుటకు వారు గొయ్యి తవ్వారు.
కాని వారే దానిలో పడ్డారు.
7దేవా, నిన్ను విశ్వసించటంలో నా హృదయం నిబ్బరంగా వున్నది.
నేను నీకు స్తుతులు పాడుతాను.
8నా ఆత్మా, మేలుకొనుము!
స్వరమండలమా, సితారా, మేలుకోండి. వేకువను మనం మేల్కొందాము
9నా ప్రభూ, నేను నిన్ను ప్రతి ఒక్కరి వద్దా స్తుతిస్తాను.
ప్రతీ జనంలో నేను నిన్ను గూర్చిన స్తుతిగీతాలు పాడుతాను.
10నీ నిజమైన ప్రేమ ఆకాశంలోకెల్లా అత్యున్నత మేఘాలకంటె ఎత్తయింది.
11ఆకాశాలకంటె దేవుడు ఎక్కువగా ఘనపర్చబడ్డాడు.
ఆయన మహిమ భూమి మీద నిండిపోయింది.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

కీర్తనల గ్రంథము 57: TERV

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి

కీర్తనల గ్రంథము 57 కోసం వీడియో