యెహోవా మంచివాడు గనుక ఆయనకు కృతజ్ఞతలు చెల్లించండి. ఆయన ప్రేమ శాశ్వతం. యెహోవా రక్షించిన ప్రతి మనిషి ఆ మాటలు చెప్పాలి. వారి శత్రువుల నుండి యెహోవా రక్షించిన ప్రతి మనిషీ ఆయనను స్తుతించాలి. అనేక దేశాల నుండి యెహోవా తన ప్రజలను ఒక్కచోట సమావేశపర్చాడు. తూర్పు పడమరల నుండి, ఉత్తర దక్షిణాల నుండి ఆయన వారిని తీసుకొని వచ్చాడు. ప్రజల్లో కొందరు ఎండిన ఎడారిలో సంచరించారు. వారు నివసించుటకు ఒక పట్టణంకోసం ఆ ప్రజలు వెదకుచుండిరి. కాని వారికి ఒక్కపట్టణం కూడా దొరకలేదు. ఆ ప్రజలు ఆకలితో, దాహంతో ఉండి బలహీనం అయ్యారు. అప్పుడు వారు సహాయం కోసం ఏడ్చి, యెహోవాకు మొరపెట్టి వేడుకొన్నారు. యెహోవా ఆ ప్రజలను వారి కష్టాలన్నింటి నుండి రక్షించాడు. ఆ ప్రజలు ఏ పట్టణంలో నివసించాలో సరిగ్గా ఆ పట్టణానికే దేవుడు ఆ ప్రజలను నడిపించాడు. యెహోవా ప్రేమకోసం ఆయనకు వందనాలు చెప్పండి! ప్రజల కోసం, దేవుడు చేసే ఆశ్చర్య కార్యాల కోసం ఆయనకు వందనాలు చెల్లించండి. దాహంతో ఉన్న ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. ఆకలితో ఉన్న ప్రాణాన్ని మంచి పదార్థాలతో దేవుడు నింపుతాడు. దేవుని ప్రజల్లో కొందరు కటిక చీకటి కారాగారాల్లో బంధింపబడి ఖైదీలుగా ఉన్నారు. ఎందుకంటే దేవుడు చెప్పిన విషయాలకు ఆ ప్రజలు విరోధంగా పోరాడారు. సర్వోన్నతుడైన దేవుని సలహా వినుటకు వారు నిరాకరించారు. ఆ ప్రజలు చేసిన పనుల మూలంగా దేవుడు వారికి జీవితాన్ని కష్టతరం చేశాడు. వారు తొట్రిల్లి, పడిపోయారు. మరి వారికి సహాయం చేసేవారు ఎవ్వరూ లేకపోయారు. ఆ ప్రజలు కష్టంలో ఉన్నారు; కనుక వారు సహాయంకోసం యెహోవాను వేడుకొన్నారు. వారి కష్టాలనుండి యెహోవా వారిని రక్షించాడు. దేవుడు వాళ్లను వారి కటిక చీకటి కారాగారాలనుండి బయటకు రప్పించాడు. మరియు వారు బంధించబడిన తాళ్లను దేవుడు తెంచివేసాడు. యెహోవా ప్రేమకోసం ఆయనకు వందనాలు చెల్లించండి. ప్రజలకోసం ఆయన చేసే ఆశ్చర్య కార్యాల కోసం ఆయనకు వందనాలు చెల్లించండి. దేవా, మా శత్రువులను ఓడించుటకు మాకు సహాయం చేయుము. వారి ఇత్తడి తలుపులను దేవుడు పగులగొట్టగలడు. వారి ద్వారాల మీది ఇనుప గడియలను దేవుడు చితకగొట్టగలడు. కొందరు ప్రజలు తమ తిరుగుబాటు మార్గాల ద్వారా తెలివితక్కువ వాళ్లయ్యారు. మరియు వారి పాపాలవల్ల కష్టాన్ని అనుభవించారు. ఆ మనుష్యులు తినటానికి నిరాకరించారు, వారు చావుకు సమీపించారు. వారు కష్టంలో ఉన్నారు, అందుచేత సహాయం కోసం యెహోవాకు మొరపెట్టారు. యెహోవా వారిని వారి కష్టాల నుండి రక్షించాడు. దేవుడు ఆజ్ఞ ఇచ్చి, ప్రజలను స్వస్థపర్చాడు. కనుక ఆ ప్రజలు సమాధి నుండి రక్షించబడ్డారు. యెహోవా ప్రేమకోసం ఆయనకు వందనాలు చెల్లించండి. ప్రజలకోసం యెహోవా చేసే ఆశ్చర్యకార్యాల కోసం ఆయనకు వందనాలు చెల్లించండి. యెహోవా చేసిన వాటన్నింటికీ కృతజ్ఞతగా ఆయనకు బలులు అర్పించండి. యెహోవా చేసిన పనులను గూర్చి సంతోషంగా చెప్పండి.
చదువండి కీర్తనల గ్రంథము 107
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: కీర్తనల గ్రంథము 107:1-22
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు