యిర్మీయా 1:5-9

యిర్మీయా 1:5-9 TERV

“నీ తల్లి గర్భంలో నిన్ను నేను రూపించక ముందే నిన్ను నేనెరిగియున్నాను. నీవు పుట్టకముందే నిన్నొక ముఖ్యమైన పనికి ఎన్నుకున్నాను. దేశాలకు నిన్నొక ప్రవక్తగా నియమించాను.” అప్పుడు, యిర్మీయానగు నేను “సర్వశక్తిమంతుడవైన యెహోవా! నేనెలా మాట్లాడాలో నాకు తెలియదు. నేను బాలుడను” అని అన్నాను. కాని యెహోవా ఇలా అన్నాడు: “బాలుడనని అనవద్దు. నేను నిన్నెక్కడికి పంపుతానో నీవచ్చటికి తప్పక వెళ్లాలి. నిన్ను ఏమి చెప్పమని అంటానో అదంతా నీవు చెప్పాలి. ఎవ్వరికీ భయపడకు. నేను నీతో ఉన్నాను. నేను నిన్ను కాపాడతాను”. ఈ వర్తమానం యెహోవానైన నా వద్దనుండి వచ్చినది. పిమ్మట యెహోవా తన చేయి చాచి నా నోటిని తాకాడు. యెహోవా నాతో ఇలా అన్నాడు