కాని ఒకవేళ నీతికోసం మీరు కష్టాలు అనుభవిస్తే మీకు దేవుని దీవెనలు లభిస్తాయి. “వాళ్ళ బెదిరింపులకు భయపడకండి. ఆందోళన చెందకండి.” క్రీస్తును మీ హృదయ మందిరంలో ప్రతిష్టించండి. మీ విశ్వాసాన్ని గురించి కారణం అడుగుతూ ఎవరైనా ప్రశ్నిస్తే, అలాంటి వాళ్ళకు సమాధానమివ్వటానికి అన్ని వేళలా సిద్ధంగా ఉండండి. కాని మర్యాదగా గౌరవంతో సమాధాన మివ్వండి. మీ మనస్సును నిష్కల్మషంగా ఉంచుకోండి. సత్ప్రవర్తనతో క్రీస్తును అనుసరిస్తున్న మిమ్మల్ని అవమానించి దుర్భాషలాడిన వాళ్ళు స్వయంగా సిగ్గుపడిపోతారు. చెడును చేసి కష్టాలను అనుభవించటంకన్నా మంచి చేసి కష్టాలను అనుభవించటమే దైవేచ్ఛ. యిదే ఉత్తమం. క్రీస్తు మీ పాపాల నిమిత్తం తన ప్రాణాన్ని ఒకేసారి యిచ్చాడు. దేవుని సన్నిధికి మిమ్మల్ని తీసుకు రావాలని నీతిమంతుడైన క్రీస్తు మీ పాపాల నిమిత్తం మరణించాడు. వాళ్ళాయనకు భౌతిక మరణం కలిగించినా, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా పునర్జీవం పొందాడు.
చదువండి పేతురు వ్రాసిన మొదటి లేఖ 3
వినండి పేతురు వ్రాసిన మొదటి లేఖ 3
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: పేతురు వ్రాసిన మొదటి లేఖ 3:14-18
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు