అందుకు యోబు ఇలా జవాబు ఇచ్చాడు, “ఇలాంటి మాటలు నేను అనేకం విన్నాను. మీరంతా ఆదరించడానికి కాదు, బాధ పెట్టడానికి వచ్చినట్టున్నారు. నువ్వు చెబుతున్న గాలిమాటలు చాలిస్తావా? నాకిలా జవాబివ్వడానికి నీకేం బాధ కలిగింది? నా దుస్థితి మీకు పట్టి ఉంటే నేను కూడా మీలాగా మాట్లాడేవాణ్ణి. మీ మీద లేనిపోని మాటలు కల్పిస్తూ నా తల ఆడిస్తూ మీవైపు చూసేవాణ్ణి. అయినప్పటికీ నేను మిమ్మల్ని ఓదార్చి ధైర్యపరిచేవాణ్ణి. నా ఆదరణ వాక్కులతో మిమ్మల్ని బలపరిచేవాణ్ణి.
Read యోబు 16
వినండి యోబు 16
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: యోబు 16:1-5
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు