పరమగీతము 3
3
1రాత్రివేళ పరుండియుండి
నేను నా ప్రాణప్రియుని వెదకితిని
వెదకినను అతడు కనబడక యుండెను.
2నేనిప్పుడే లేచెదను
పట్టణము వెంబడిపోయి వెదకుదును
సంతవీధులలోను రాజవీధులలోను తిరుగుదును
నా ప్రాణప్రియుని వెదకుదును అని
నేననుకొంటిని.
నేను వెదకినను అతడు కనబడలేదు.
3పట్టణమునందు సంచరించు కావలివారు నాకెదురు
పడగా
మీరు నా ప్రాణప్రియుని చూచితిరా? అని నేనడిగి
తిని
4నేను వారిని విడిచి కొంచెము దూరము పోగా
నా ప్రాణప్రియుడు నాకెదురుపడెను
వదలిపెట్టక నేనతని పట్టుకొంటిని
నా తల్లి యింటికతని తోడుకొని వచ్చితిని
నన్ను కనినదాని యరలోనికి తోడుకొని వచ్చితిని.
5యెరూషలేము కుమార్తెలారా,
పొలములోని యిఱ్ఱులనుబట్టియు లేళ్లనుబట్టియు
మీచేత ప్రమాణము చేయించుకొని
లేచుటకు ప్రేమకు ఇష్టమగువరకు
మీరు లేపకయు కలతపరచకయు
నుండుడని నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను.
6ధూమ స్తంభములవలె అరణ్యమార్గముగా వచ్చు ఇది
ఏమి?
గోపరసముతోను సాంబ్రాణితోను వర్తకులమ్ము వివిధ
మైన సుగంధ చూర్ణములతోను
పరిమళించుచు వచ్చు ఇది ఏమి?
7ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది
అరువదిమంది శూరులు దానికి పరివారమువారు ఇశ్రాయేలీయులలో పరాక్రమశాలులు
వారందరును ఖడ్గధారులు యుద్ధవీరులు
8రాత్రి భయముచేత వారు ఖడ్గము ధరించి వచ్చుచున్నారు.
9లెబానోను మ్రానుతో మంచమొకటి
సొలొమోనురాజు తనకు చేయించుకొని యున్నాడు.
10దాని స్తంభములు వెండిమయములు
దాని పాదములు స్వర్ణమయములు
దాని మెత్తలు ధూమ్రవర్ణవస్త్రముతో చేయబడెను
ప్రేమను సూచించు విచిత్రమైన కుట్టుపెనితో
యెరూషలేము కుమార్తెలు దాని లోపలిభాగము నలంక
రించిరి.
11సీయోను కుమార్తెలారా, వేంచేయుడి
కిరీటము ధరించిన సొలొమోనురాజును చూడుడి
వివాహదినమున అతని తల్లి
అతనికి పెట్టిన కిరీటము చూడుడి
ఆ దినము అతనికి బహు సంతోషకరము.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
పరమగీతము 3: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.