కీర్తనలు 99

99
1యెహోవా రాజ్యము చేయుచున్నాడు జనములు
వణకును
ఆయన కెరూబులమీద ఆసీనుడై యున్నాడు భూమి కదలును.
2సీయోనులో యెహోవా మహోన్నతుడు
జనములన్నిటిపైన ఆయన హెచ్చియున్నాడు.
3భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు.
యెహోవా పరిశుద్ధుడు.
4యథార్థతనుబట్టి నీవు న్యాయమును ప్రేమించు
రాజును స్థిరపరచియున్నావు
యాకోబు సంతతిమధ్య నీవు నీతి న్యాయములను
జరిగించియున్నావు.
5మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి
ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడుడి
ఆయన పరిశుద్ధుడు.
6ఆయన యాజకులలో మోషే అహరోనులుండిరి
ఆయన నామమునుబట్టి ప్రార్థన చేయువారిలో
సమూయేలు ఉండెను.వారు యెహోవాకు మొఱ్ఱపెట్టగా
ఆయన వారి కుత్తరమిచ్చెను.
7మేఘస్తంభములోనుండి ఆయన వారితో మాట
లాడెనువారు ఆయన శాసనముల ననుసరించిరి
ఆయన తమకిచ్చిన కట్టడను వారనుసరించిరి
8యెహోవా మా దేవా, నీవు వారికుత్తరమిచ్చితివివారిక్రియలనుబట్టి ప్రతికారము చేయుచునే
వారి విషయములో నీవు పాపము పరిహరించు దేవుడవైతివి.
9మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు
మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి.
ఆయన పరిశుద్ధపర్వతము ఎదుట సాగిలపడుడి.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

కీర్తనలు 99: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి