కీర్తనలు 91

91
1మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని
నీడను విశ్రమించువాడు.
2–ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ము
కొను నా దేవుడని
నేను యెహోవానుగూర్చి చెప్పుచున్నాను.
3వేటకాని ఉరిలోనుండి ఆయన నిన్ను విడిపించును
నాశనకరమైన తెగులు రాకుండ నిన్ను రక్షించును
4ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును
ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును
ఆయన సత్యము, కేడెమును డాలునై యున్నది.
5రాత్రివేళ కలుగు భయమునకైనను
పగటివేళ ఎగురు బాణమునకైనను
6చీకటిలో సంచరించు తెగులునకైనను
మధ్యాహ్నమందు పాడుచేయు రోగమునకైనను
నీవు భయపడకుందువు.
7నీ ప్రక్కను వేయి మంది పడినను
నీ కుడిప్రక్కను పదివేలమంది కూలినను
అపాయము నీ యొద్దకురాదు.
8నీవు కన్నులార చూచుచుండగా
భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును
9–యెహోవా, నీవే నా ఆశ్రయము అని
నీవు మహోన్నతుడైన దేవుని నీకు
నివాసస్థలముగా చేసికొనియున్నావు
10నీకు అపాయమేమియు రాదు
ఏ తెగులును నీ గుడారమును సమీపించదు
11నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు
ఆయన నిన్నుగూర్చి తన దూతలను ఆజ్ఞాపించును
12నీ పాదములకు రాయి తగులకుండవారు నిన్ను తమ చేతులమీద ఎత్తి పట్టుకొందురు
13నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు
కొదమ సింహములను భుజంగములను అణగ ద్రొక్కెదవు.
14అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతని
తప్పించెదను
అతడు నా నామము నెరిగినవాడు గనుక నేనతని
ఘనపరచెదను
15అతడు నాకు మొఱ్ఱపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చె
దను
శ్రమలో నేనతనికి తోడై యుండెదను
అతని విడిపించి అతని గొప్ప చేసెదను
16దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను
నా రక్షణ అతనికి చూపించెదను.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

కీర్తనలు 91: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి

Video for కీర్తనలు 91