కీర్తనలు 82

82
ఆసాపు కీర్తన.
1దేవుని సమాజములో దేవుడు నిలిచియున్నాడు
దైవములమధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు.
2ఎంతకాలము మీరు అన్యాయముగా తీర్పుతీర్చుదురు?
ఎంతకాలము భక్తిహీనులయెడల పక్షపాతము చూపు
దురు? (సెలా.)
3పేదలకును తలిదండ్రులులేనివారికిని న్యాయము తీర్చుడి
శ్రమగలవారికిని దీనులకును న్యాయము తీర్చుడి.
4దరిద్రులను నిరుపేదలను విడిపించుడి
భక్తిహీనులచేతిలోనుండి వారిని తప్పించుడి.
5జనులకు తెలివి లేదువారు గ్రహింపరువారు అంధకారములో ఇటు అటు తిరుగులాడుదురు
దేశమునకున్న ఆధారములన్నియు కదలుచున్నవి.
6–మీరు దైవములనియు
మీరందరు సర్వోన్నతుని కుమారులనియు నేనే సెల
విచ్చియున్నాను.
7అయినను ఇతర మనుష్యులు చనిపోవునట్లు మీరును
చనిపోవుదురు
అధికారులలో ఒకడు కూలునట్లు మీరును కూలుదురు.
8దేవా లెమ్ము, భూమికి తీర్పు తీర్చుము
అన్యజనులందరు నీకే స్వాస్థ్యముగా ఉందురు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

కీర్తనలు 82: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for కీర్తనలు 82