కీర్తనలు 69
69
ప్రధానగాయకునికి. షోషన్నీయులను రాగముమీద పాడదగినది. దావీదు కీర్తన.
1దేవా, జలములు నా ప్రాణముమీద పొర్లుచున్నవి
నన్ను రక్షింపుము.
2నిలుక యియ్యని అగాధమైన దొంగ ఊబిలో నేను
దిగిపోవుచున్నాను
అగాధ జలములలో నేను దిగబడియున్నాను
వరదలు నన్ను ముంచివేయుచున్నవి.
3నేను మొఱ్ఱపెట్టుటచేత అలసియున్నాను నా
గొంతుక యెండిపోయెను
నా దేవునికొరకు కనిపెట్టుటచేత నా కన్నులు
క్షీణించిపోయెను.
4నిర్నిమిత్తముగా నామీద పగపట్టువారు
నా తలవెండ్రుకలకంటె విస్తారముగా ఉన్నారు
అబద్ధమునుబట్టి నాకుశత్రువులై నన్ను సంహరింప
గోరువారు అనేకులు
నేను దోచుకొననిదానిని నేను ఇచ్చుకొనవలసి
వచ్చెను.
5దేవా, నా బుద్ధిహీనత నీకు తెలిసేయున్నది
నా అపరాధములు నీకు మరుగైనవి కావు.
6ప్రభువా, సైన్యములకధిపతివగు యెహోవా,
నీకొరకు కనిపెట్టుకొనువారికి నావలన సిగ్గు కలుగ
నియ్యకుము
ఇశ్రాయేలు దేవా, నిన్ను వెదకువారిని నావలన
అవమానము నొంద నియ్యకుము.
7నీ నిమిత్తము నేను నిందనొందినవాడనైతిని
నీ నిమిత్తము సిగ్గు నా ముఖమును కప్పెను.
8నా సహోదరులకు నేను అన్యుడనైతిని
నా తల్లి కుమారులకు పరుడనైతిని.
9నీ యింటినిగూర్చిన ఆసక్తి నన్ను భక్షించియున్నది
నిన్ను నిందించినవారి నిందలు నామీద పడియున్నవి.
10ఉపవాసముండి నేను కన్నీరు విడువగా
అది నాకు నిందాస్పదమాయెను.
11నేను గోనెపట్ట వస్త్రముగా కట్టుకొనినప్పుడువారికి హాస్యాస్పదుడనైతిని.
12గుమ్మములలో కూర్చుండువారు నన్నుగూర్చి మాటలాడుకొందురు
త్రాగుబోతులు నన్నుగూర్చి పాటలు పాడుదురు.
13యెహోవా, అనుకూల సమయమున నేను నిన్ను
ప్రార్థించుచున్నాను.
దేవా, నీ కృపాబాహుళ్యమునుబట్టి
నీ రక్షణ సత్యమునుబట్టి నాకుత్తరమిమ్ము.
14నేను దిగిపోకుండ ఊబిలోనుండి నన్ను తప్పించుము
నా పగవారిచేతిలోనుండి అగాధజలములలోనుండి
నన్ను తప్పించుము.
15నీటివరదలు నన్ను ముంచనియ్యకుము
అగాధసముద్రము నన్ను మ్రింగనియ్యకుము
గుంట నన్ను మ్రింగనియ్యకుము.
16యెహోవా, నీ కృప ఉత్తమత్వమునుబట్టి నాకు ఉత్తర
మిమ్ము
నీ వాత్సల్యబాహుళ్యతనుబట్టి నాతట్టు తిరుగుము.
17నీ సేవకునికి విముఖుడవై యుండకుము
నేను ఇబ్బందిలోనున్నాను త్వరగా నాకు ఉత్తరమిమ్ము.
18నాయొద్దకు సమీపించి నన్ను విమోచింపుము.
నా శత్రువులను చూచి నన్ను విడిపింపుము.
19నిందయు సిగ్గును అవమానమును నాకు కలిగెనని నీకు తెలిసియున్నది.
నా విరోధులందరు నీకు కనబడుచున్నారు.
20నిందకు నా హృదయము బద్దలాయెను నేను బహుగా
కృశించియున్నాను
కరుణించువారికొరకు కనిపెట్టుకొంటినిగాని యెవ
రును లేకపోయిరి.
ఓదార్చువారికొరకు కనిపెట్టుకొంటినిగాని యెవరును
కానరారైరి.
21వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి
నాకు దప్పియైనప్పుడు చిరకను త్రాగనిచ్చిరి.
22వారి భోజనము వారికి ఉరిగానుండును గాకవారు నిర్భయులై యున్నప్పుడు అది వారికి ఉరిగానుండును గాక.
23వారు చూడకపోవునట్లు వారి కన్నులు చీకటి కమ్మును గాకవారి నడుములకు ఎడతెగని వణకు పుట్టించుము.
24వారిమీద నీ ఉగ్రతను కుమ్మరించుము
నీ కోపాగ్ని వారిని పట్టుకొనును గాక
25వారి పాళెము పాడవును గాకవారి గుడారములలో ఎవడును ఉండకపోవును గాక
26నీవు మొత్తినవానిని వారు తరుముచున్నారు
నీవు గాయపరచినవారి వేదనను వివరించుచున్నారు.
27దోషముమీద దోషము వారికి తగులనిమ్ము
నీ నీతి వారికి అందనీయకుము.
28జీవగ్రంథములోనుండి వారి పేరును తుడుపు పెట్టుము
నీతిమంతుల పట్టీలో వారి పేరులు వ్రాయకుము.
29నేను బాధపడినవాడనై వ్యాకులపడుచున్నాను
దేవా, నీ రక్షణ నన్ను ఉద్ధరించును గాక.
30కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను
కృతజ్ఞతాస్తుతులతో నేనాయనను ఘనపరచెదను
31ఎద్దుకంటెను, కొమ్ములును డెక్కలునుగల కోడె
కంటెను అది యెహోవాకు ప్రీతికరము
32బాధపడువారు దాని చూచి సంతోషించుదురు
దేవుని వెదకువారలారా, మీ ప్రాణము తెప్పరిల్లును
గాక.
33యెహోవా దరిద్రుల మొఱ్ఱ ఆలకించువాడు
ఖైదులో నుంచబడిన తన వారిని ఆయన తృణీకరించు
వాడు కాడు.
34భూమ్యాకాశములు ఆయనను స్తుతించును గాక
సముద్రములును వాటియందు సంచరించు సమస్త
మును ఆయనను స్తుతించును గాక.
35దేవుడు సీయోనును రక్షించును ఆయన యూదా
పట్టణములను కట్టించును
జనులు అక్కడ నివసించెదరు అది వారివశమగును.
36ఆయన సేవకుల సంతానము దానిని స్వతంత్రించు
కొనును
ఆయన నామమును ప్రేమించువారు అందులో నివ
సించెదరు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
కీర్తనలు 69: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.