కీర్తనలు 66

66
ప్రధానగాయకునికి. కీర్తన. గీతము.
1సర్వలోకనివాసులారా, దేవునిగూర్చి సంతోష
గీతము పాడుడి.
ఆయన నామప్రభావము కీర్తించుడి
2ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రించుడి
ఈలాగు దేవునికి స్తోత్రము చెల్లించుడి.
3–నీ కార్యములు ఎంతో భీకరమైనవి
నీ బలాతిశయమునుబట్టి నీ శత్రువులు లొంగి నీ
యొద్దకు వచ్చెదరు
4సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును
నీ నామమునుబట్టి నిన్ను కీర్తించును. (సెలా.)
5దేవుని ఆశ్చర్యకార్యములను చూడ రండి
నరులయెడల ఆయన జరిగించు కార్యములను చూడగా
ఆయన భీకరుడై యున్నాడు.
6ఆయన సముద్రమును ఎండిన భూమిగా జేసెను
జనులు కాలినడకచే దాటిరి.
అక్కడ ఆయనయందు మేము సంతోషించితిమి.
7ఆయన తన పరాక్రమమువలన నిత్యము ఏలుచున్నాడు?
అన్యజనులమీద ఆయన తన దృష్టియుంచియున్నాడు.
ద్రోహులు తమ్ము తాము హెచ్చించుకొన తగదు. (సెలా.)
8జనములారా, మా దేవుని సన్నుతించుడి
గొప్ప స్వరముతో ఆయన కీర్తి వినిపించుడి.
9జీవప్రాప్తులనుగా మమ్మును కలుగజేయువాడు ఆయనే
ఆయన మా పాదములు కదలనియ్యడు.
10దేవా, నీవు మమ్మును పరిశీలించియున్నావు.
వెండిని నిర్మలము చేయురీతిగా మమ్మును నిర్మలులను చేసియున్నావు.
11నీవు బందీగృహములో మమ్ము ఉంచితివి
మా నడుములమీద గొప్పభారము పెట్టితివి.
12నరులు మా నెత్తిమీద ఎక్కునట్లు చేసితివి
మేము నిప్పులలోను నీళ్లలోను పడితిమి
అయినను నీవు సమృద్ధిగలచోటికి మమ్ము రప్పించి
యున్నావు.
13దహనబలులను తీసికొని నేను నీ మందిరములోనికి
వచ్చెదను.
14నాకు శ్రమ కలిగినప్పుడు
నా పెదవులు పలికిన మ్రొక్కుబడులను
నా నోరు వచించిన మ్రొక్కుబడులను నేను నీకు
చెల్లించెదను
15పొట్టేళ్లను ధూపమును క్రొవ్విన గొఱ్ఱెలను తీసికొని
నీకు దహనబలులు అర్పించెదను.
ఎద్దులను పోతుమేకలను అర్పించెదను. (సెలా).
16దేవునియందు భయభక్తులుగలవారలారా, మీరందరు
వచ్చి ఆలకించుడి
ఆయన నాకొరకు చేసిన కార్యములను నేను విని
పించెదను.
17ఆయనకు నేను మొఱ్ఱపెట్టితిని
అప్పుడే నా నోట శ్రేష్ఠమైన కీర్తన యుండెను.
18నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసినయెడల
ప్రభువు నా మనవి వినకపోవును.
19నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి
యున్నాడు
ఆయన నా విజ్ఞాపన ఆలకించియున్నాడు
20దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు
నాయొద్దనుండి తన కృపను తొలగింపలేదు;
ఆయన సన్నుతింపబడును గాక.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

కీర్తనలు 66: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి

Video for కీర్తనలు 66