కీర్తనలు 62

62
ప్రధానగాయకునికి. యెదూతూను అను రాగముమీద పాడదగినది. దావీదు కీర్తన.
1నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది.
ఆయనవలన నాకు రక్షణ కలుగును.
2ఆయనే నా ఆశ్రయదుర్గము ఆయనే నా రక్షణకర్త
ఎత్తయిన నాకోట ఆయనే, నేను అంతగా కదలింప
బడను.
3ఎన్నాళ్లు మీరు ఒకనిపైబడుదురు?
ఒరుగుచున్న గోడను పడబోవు కంచెను ఒకడు పడ
ద్రోయునట్లు మీ రందరు ఎన్నాళ్లు ఒకని పడ
ద్రోయ చూచుదురు?
4అతని ఔన్నత్యమునుండి అతని పడద్రోయుటకేవారు ఆలోచించుదురు
అబద్ధమాడుట వారికి సంతోషమువారు తమ నోటితో శుభవచనములు పలుకుచు
అంతరంగములో దూషించుదురు. (సెలా.)
5నా ప్రాణమా, దేవుని నమ్ముకొని మౌనముగా
నుండుము
ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది.
6ఆయనే నా ఆశ్రయదుర్గము నా రక్షణాధారము
నా ఎత్తయిన కోట ఆయనే, నేను కదలింపబడను.
7నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము.
నా బలమైన ఆశ్రయదుర్గము
నా యాశ్రయము దేవునియందే యున్నది.
8జనులారా, యెల్లప్పుడు ఆయనయందు నమ్మిక
యుంచుడి
ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి
దేవుడు మనకు ఆశ్రయము. (సెలా.)
9అల్పులైనవారు వట్టి ఊపిరియై యున్నారు.
ఘనులైనవారు మాయస్వరూపులు
త్రాసులో వారందరు తేలిపోవుదురు
వట్టి ఊపిరికన్న అలకనగా ఉన్నారు
10బలాత్కారమందు నమ్మికయుంచకుడి
దోచుకొనుటచేత గర్వపడకుడి
ధనము హెచ్చినను దానిని లక్ష్యపెట్టకుడి.
11–బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను
రెండు మారులు ఆ మాట నాకు వినబడెను.
12ప్రభువా, మనుష్యులకందరికి వారి వారి క్రియల
చొప్పున నీవే ప్రతిఫలమిచ్చుచున్నావు.
కాగా కృపచూపుటయు నీది.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

కీర్తనలు 62: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for కీర్తనలు 62