కీర్తనలు 54

54
ప్రధానగాయకునికి. తంతివాద్యములతో పాడదగినది. జీఫీయులు వచ్చి–దావీదు మాలో దాగియున్నాడు కాడా అని సౌలుతో చెప్పినప్పుడు దావీదు రచించిన దైవధ్యానము.
1దేవా, నీ నామమునుబట్టి నన్ను రక్షింపుము
నీ పరాక్రమమునుబట్టి నాకు న్యాయము తీర్చుము.
2దేవా, నా ప్రార్థన ఆలకింపుము
నా నోటి మాటలు చెవినిబెట్టుము.
3అన్యులు నా మీదికి లేచియున్నారు
బలాఢ్యులు నా ప్రాణము తీయజూచుచున్నారువారు తమయెదుట దేవుని ఉంచుకొన్నవారు కారు. (సెలా.)
4ఇదిగో దేవుడే నాకు సహాయకుడు
ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు
5నా శత్రువులుచేయు కీడు ఆయన వారిమీదికి
రప్పించును
నీ సత్యమునుబట్టి వారిని నశింపజేయుము
స్వేచ్ఛార్పణలైన బలులను నేను నీకర్పించెదను.
6యెహోవా, నీ నామము ఉత్తమము
నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.
7ఆపదలన్నిటిలోనుండి ఆయన నన్ను విడిపించి
యున్నాడు
నా శత్రువుల గతిని చూచి నా కన్ను సంతోషించుచున్నది.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

కీర్తనలు 54: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for కీర్తనలు 54