కీర్తనలు 44

44
ప్రధానగాయకునికి కోరహు కుమారులు చేసినది. దైవధ్యానము.
1దేవా, పూర్వకాలమున మా పితరుల దినములలో
నీవు చేసినపనినిగూర్చి మేము చెవులార విని
యున్నాము
మా పితరులు దానిని మాకు వివరించిరి
2నీవు నీ భుజబలముచేత అన్యజనులను వెళ్లగొట్టి మా
పితరులను నాటితివి
జనములను నిర్మూలము చేసి వారిని వ్యాపింపజేసితివి.
3వారు తమ ఖడ్గముచేత దేశమును స్వాధీనపరచు
కొనలేదు
వారి బాహువు వారికి జయమియ్యలేదు
నీవు వారిని కటాక్షించితివి గనుక
నీ దక్షిణహస్తమే నీ బాహువే నీ ముఖకాంతియేవారికి విజయము కలుగజేసెను.
4దేవా, నీవే నా రాజవు
యాకోబునకు పూర్ణరక్షణ కలుగ నాజ్ఞాపించుము.
5నీవలన మా విరోధులను అణచివేయుదుము
నీ నామమువలననే, మామీదికి లేచువారిని మేము
త్రొక్కి వేయుదుము.
6నేను నా వింటిని నమ్ముకొనను
నా కత్తియు నన్ను రక్షింపజాలదు
7మా శత్రువుల చేతిలోనుండి మమ్మును రక్షించు
వాడవు నీవే
మమ్మును ద్వేషించువారిని సిగ్గుపరచువాడవు నీవే.
8దినమెల్ల మేము దేవునియందు అతిశయపడుచున్నాము
నీ నామమునుబట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు
చెల్లించుచున్నాము. (సెలా.)
9అయితే ఇప్పుడు నీవు మమ్మును విడనాడి అవమాన
పరచియున్నావు.
మాసేనలతోకూడ నీవు బయలుదేరకయున్నావు.
10శత్రువులయెదుట నిలువకుండ మమ్మును వెనుకకు
పారిపోజేయుచున్నావు
మమ్మును ద్వేషించువారు ఇష్టమువచ్చినట్లు మమ్మును
దోచుకొనుచున్నారు.
11భోజనపదార్థముగా ఒకడు గొఱ్ఱెలను అప్పగించునట్లు
నీవు మమ్మును అప్పగించియున్నావు
అన్యజనులలోనికి మమ్మును చెదరగొట్టి యున్నావు
12అధికమైన వెల చెప్పక ధనప్రాప్తిలేకయే
నీవే నీ ప్రజలను అమ్మి యున్నావు
13మా పొరుగువారి దృష్టికి నీవు మమ్మును నిందాస్పద
ముగా చేసియున్నావు మా చుట్టు నున్న వారి
దృష్టికి అపహాస్యాస్పదముగాను ఎగతాళికి కారణ
ముగాను
మమ్మును ఉంచియున్నావు.
14అన్యజనులలో మమ్మును సామెతకు హేతువుగాను
ప్రజలు తల ఆడించుటకు కారణముగాను
మమ్మును ఉంచియున్నావు.
15-16నన్ను నిందించి దూషించువారి మాటలు వినగా
శత్రువులనుబట్టియు పగ తీర్చుకొనువారినిబట్టియు
నేను దినమెల్ల నా అవమానమును తలపోయుచున్నాను
సిగ్గు నా ముఖమును కమ్మియున్నది.
17ఇదంతయు మా మీదికి వచ్చినను మేము నిన్ను మరువలేదు
నీ నిబంధన మీరి ద్రోహులము కాలేదు.
18మా హృదయము వెనుకకు మరలిపోలేదు
మా అడుగులు నీ మార్గమును విడిచి తొలగిపోలేదు.
19అయితే నక్కలున్నచోట నీవు మమ్మును బహుగా
నలిపియున్నావు
గాఢాంధకారముచేత మమ్మును కప్పియున్నావు
20మా దేవుని నామమును మేము మరచియున్నయెడల
అన్యదేవతలతట్టు మా చేతులు చాపియున్నయెడల
21హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు
ఆ సంగతిని పరిశోధింపక మానునా?
22నిన్నుబట్టి దినమెల్ల మేము వధింపబడుచున్నాము
వధకు సిద్ధమైన గొఱ్ఱెలమని మేము ఎంచబడు
చున్నాము
23ప్రభువా, మేల్కొనుము నీవేల నిద్రించుచున్నావు?
లెమ్ము నిత్యము మమ్మును విడనాడకుము.
24నీ ముఖమును నీ వేల మరుగుపరచియున్నావు?
మా బాధను మాకు కలుగు హింసను నీవేల మరచి
యున్నావు?
25మా ప్రాణము నేలకు క్రుంగియున్నది
మా శరీరము నేలను పెట్టియున్నది.
26మా సహాయమునకు లెమ్ము
నీ కృపనుబట్టి మమ్మును విమోచింపుము.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

కీర్తనలు 44: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి