కీర్తనలు 33

33
1నీతిమంతులారా, యెహోవానుబట్టి ఆనంద గానము
చేయుడి.
స్తుతిచేయుట యథార్థవంతులకు శోభస్కరము.
2సితారాతో యెహోవాను స్తుతించుడి
పది తంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి
3ఆయననుగూర్చి నూతన కీర్తన పాడుడి
ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి.
4యెహోవా వాక్యము యథార్థమైనది
ఆయన చేయునదంతయు నమ్మకమైనది.
5ఆయన నీతిని, న్యాయమును ప్రేమించుచున్నాడు
లోకము యెహోవా కృపతో నిండియున్నది.
6యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను
ఆయన నోటి ఊపిరిచేత వాటి సర్వసమూహము
కలిగెను.
7సముద్రజలములను రాశిగా కూర్చువాడు ఆయనే.
అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే.
8లోకులందరు యెహోవాయందు భయభక్తులు నిలుపవలెను.
భూలోక నివాసులందరు ఆయనకు వెరవవలెను.
9ఆయన మాట సెలవియ్యగా దాని ప్రకారమాయెను
ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను.
10అన్యజనముల ఆలోచనలను యెహోవా వ్యర్థపరచును
జనముల యోచనలను ఆయన నిష్ఫలములుగా జేయును.
11యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును
ఆయన సంకల్పములు తరతరములకు ఉండును.
12యెహోవా తమకు దేవుడుగాగల జనులు ధన్యులు.
ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొను జనులు
ధన్యులు.
13యెహోవా ఆకాశములోనుండి కనిపెట్టుచున్నాడు
ఆయన నరులందరిని దృష్టించుచున్నాడు.
14తానున్న నివాసస్థలములోనుండి
భూలోక నివాసులందరివైపు ఆయన చూచుచున్నాడు.
15ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా
నిర్మించినవాడు
వారి క్రియలన్నియు విచారించువాడు వారిని
దర్శించువాడు.
16ఏ రాజును సేనాబలముచేత రక్షింపబడడు
ఏ వీరుడును అధికబలముచేత తప్పించుకొనడు.
17రక్షించుటకు గుఱ్ఱము అక్కరకు రాదు
అది దాని విశేషబలముచేత మనుష్యులను తప్పింప
జాలదు.
18వారి ప్రాణమును మరణమునుండి తప్పించుటకును
కరవులో వారిని సజీవులనుగా కాపాడుటకును
19యెహోవా దృష్టి ఆయనయందు భయభక్తులుగలవారిమీదను
ఆయన కృపకొరకు కనిపెట్టువారిమీదను నిలుచుచున్నది.
20మనము యెహోవా పరిశుద్ధనామమందు నమ్మిక
యుంచియున్నాము.
ఆయననుబట్టి మన హృదయము సంతోషించుచున్నది
21మన ప్రాణము యెహోవాకొరకు కనిపెట్టుకొనుచున్నది
ఆయనే మనకు సహాయమును మనకు కేడెమునై
యున్నాడు.
22యెహోవా, మేము నీకొరకు కనిపెట్టుచున్నాము
నీ కృప మామీదనుండును గాక.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

కీర్తనలు 33: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for కీర్తనలు 33